అడవుల్లో ఉండే క్రూర మృగాలలో అతి భయంకరమైనవి పులులు సింహాలు అన్న విషయం తెలిసిందే. భారీ ఆకారం కలిగి ఎంతో శక్తివంతంగా ఉంటాయి. పెద్ద పెద్ద జంతువులను సైతం ఎంతో అలవోకగా వేటాడటం లాంటివి చేస్తూ ఉంటాయి పులులు, సింహాలు.  సింహం అడవికి బాహుబలి లాంటిది అయితే అటు పులి బల్లలాదేవుడు లాంటి బలం కలిగి ఉంటుంది అని చెప్పాలి. అయితే ఆహార విషయంలో ఎంతో క్రూరంగా వ్యవహరించే ఈ జంతువులు మిగతా విషయాల్లో మాత్రం మనుషుల్లాగానే ప్రవర్తిస్తాయి అన్నది మాత్రం కొన్ని వీడియోలు చూస్తే అర్థమవుతూ ఉంటుంది


 ప్రేమ,సరసం, విషాదం, భయం దుఃఖం లాంటి మనుషుల్లో ఉండే గుణాలు క్రూర మృగాలైన సింహాలు పులులకు కూడా ఉంటాయి. ఇకపోతే మనుషులు అడవుల్లోకి వెళ్ళినప్పుడు మృగాలను చూసి భయపడటం లాంటివి చూస్తూ ఉంటాం. అలాగే ఇక క్రూర మృగాలు దారి తప్పి మానవారణ్యంలోకి వస్తే అవి కూడా కొన్నిసార్లు భయపడుతూ ఉంటాయి. ఇక్కడ ఇందుకు సంబంధించిన వీడియో ని సోషల్ మీడియా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. దారితప్పి జనావాసాల్లోకి వచ్చింది ఇక్కడ ఒక భారీ సింహం.


 సింహం అంటే కేవలం ధైర్యానికి మారుపేరు అని మాత్రమే ఇప్పటివరకు అందరికీ తెలుసు. కానీ ఇక్కడ మాత్రం ఒక సింహం ఏకంగా ఒక మనిషిని చూసి పొదల్లో దాక్కుని ఉండిపోయింది. రోడ్డుపై జాగింగ్ చేస్తూ వస్తున్న మనిషిని చూసి ఒక్కసారిగా అప్రమత్తమైన సింహం పొదల్లోకి వెళ్లి దాక్కుంది. అంతేకాకుండా తొంగి తొంగి చూస్తూ సదరు మనిషి వెళ్లిపోయాడా లేదా అని విస్తు పోయింది అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో ట్విటర్ వేదికగా తెగ చెక్కర్లు కొడుతుంది. అడవి జంతువులు చాలా సందర్భాల్లో మనుషులు ఎదురైనప్పుడు పక్కకు తప్పుకుంటాయి అంటూ ఈ వీడియోని పోస్ట్ చేసిన ఐఏఎఫ్ అధికారి ఒక క్యాప్షన్ కూడా ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: