మనదేశంలో ఓ నది ఉంది. అది మామూలు నది కాదు మిగతా నదుల్లో కెల్లా చాలా డిఫ్రెంట్.. ఇది మిగతా వాటితో పోల్చితే పూర్తిగా భిన్నమైన నది. ఎందుకంటే అది సాగు నీరు, చేపలు మాత్రమే కాదు.. బంగారాన్ని కూడా ఇస్తుంది. ఏన్నో సంవత్సరాలుగా ఈ నది తీసుకొచ్చే బంగారంతో జీవనం సాగిస్తున్నారు ఆ చుట్టు పక్కల పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు.. ఈ నది జీవరాసులు నిలయం మాత్రమే కాదు బంగారాన్ని ఇచ్చే బంగారు నది. ఈ నది పేరు సుర్ణరేఖ నది. అలాగే దీన్ని సుబర్ణరేఖ నది అని కూడా పిలుస్తూ ఉంటారు. బంగారం వస్తుంది కాబట్టి స్వర్ణరేఖ అని కూడా పిలుస్తారు.ఈ నది ఝార్ఖండ్‌లోని రత్నగర్భ ప్రాంతంలో మొదలవుతుంది. ఇక ఈ నది నుంచి స్థానికులు బంగారాన్ని తీసుకుంటారు. ఇది ఝర్ఖండ్‌తో పాటు పశ్చిమ బెంగాల్, ఇంకా అలాగే ఒడిశాలోని కొన్ని ప్రాంతాలను కలుపుతూ ముందుకు సాగుతుంది. ఇక స్వర్ణరేఖ అంటే బంగారు గీత అని అర్ధం కాబట్టి పేరుకి తగ్గట్లే ఈ నదిలో బంగారం లభిస్తుంది.


 ఈ స్వర్ణ రేఖ నది పుట్టుక విషయానికి వస్తే.. ఇది నైరుతి దిశలో ఉన్న నాగ్డి గ్రామంలోని రాణి చువాన్ అనే ప్రదేశంలోని ఓ బావిలో పుట్టి.. ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీదుగా చివరకు బంగాళాఖాతంలో ఈ నది కలుస్తుంది.ఇక ఈ నది మొత్తం పొడవు 474 కిలోమిటర్ల దూరం ప్రయాణించి ఒరిస్సా దగ్గర బంగాళాఖాతంలో ఇది కలుస్తుంది.జార్ఖండ్‌లో స్వర్ణరేఖ నది ప్రవహించే ప్రాంతల్లో అక్కడి ప్రజలు ఉదయాన్నే  చేరుకుంటారు. ఇక అక్కడికి చేరుకుని ఇసుకను జల్లెడపట్టి బంగారం తీసుకుంటారు. ఇందులో చాలా తరాలుగా బంగారాన్ని వెలికితీసి వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు.ఇక్కడ పురుషులు ఇంకా మహిళలు మాత్రమే కాదు పిల్లలు కూడా నది నుంచి బంగారం వెలికితీసే పనిలో ఫుల్ బిజీగా ఉంటారు.అయితే ఈ నదిలో బంగారం ఎక్కడి నుంచి వస్తుందనేది ఇప్పటి వరకు పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది.అయితే ఈ నది రాళ్ల ద్వారా వస్తుందని, అందుకే అందులో బంగారు రేణువులు కనిపిస్తాయని కొంతమంది భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, బంగారం  ఎక్కడి నుంచి వస్తుందనేది మాత్రం వారు కూడా ఖచ్చితంగా చెప్పలేకపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: