సాధారణంగా రెస్టారెంట్ కు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కాస్త హుందాగానే నడుచుకుంటారు. ఇక సొంత ఇంట్లో ఆహారాన్ని ఎలా తీసుకున్నప్పటికీ.. అటు రెస్టారెంట్లలో మాత్రం ఎంతో నీట్ గాతినడానికి ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే కొంతమంది కస్టమర్లు మాత్రం ఇక హుందాగా నడుచుకోవాల్సిన హోటల్లో చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక్కడ ఒక బాలుడు ఇలాంటిదే చేశాడు. అతను సరదా కోసం 30 సెకండ్ల పాటు చేసిన పని ఏకంగా హోటల్ కి 946కోట్ల నష్టాన్ని చేకూర్చింది అని చెప్పాలి. ఏకంగా సోయా సాస్ ను నాలుకతో ఎంగిలి చేసి మళ్ళీ అక్కడే పెట్టేసాడు బాలుడు. అక్కడితో ఆగకుండా అక్కడ ఉన్న టీ కప్పులను కూడా నాలుకతో నాకుతూ లాలాజలం అంటించాడు.


 అంతేకాదు తన వేలిని నోట్లో పెట్టుకుని తీసి అక్కడ పక్క నుంచి వెళ్తున్న ఆహార పదార్థాలపై ఆ వేలిని పెట్టాడు. ఇక ఆ సమయంలో తప్పు అని చెప్పాల్సిన మరో స్నేహితుడు పక్క నుంచి ఇదంతా వీడియో తీయడం గమనార్హం. ఇక తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇక ఇది వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. దీంతో ఇక ఆ రెస్టారెంట్ అమ్మకాలు విపరీతంగా పడిపోయాయి. ఈ ఘటన జపాన్ లోని సుశీ రెస్టారెంట్ లో జరిగింది. ఇక ఆ బాలుడిపై రెస్టారెంట్  ఓనర్స్ 3.95 కోట్ల దావ వేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. అయితే సదరు బాలుడు ఇక 30 సెకండ్ల పాటు సరదా కోసం చేసిన పని చివరికి సుశీ కంపెనీకి 946 కోట్ల నష్టం తెచ్చిపెట్టింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే మరోసారి ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ఇక సదరు కంపెనీ నిర్వాహకులకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇక రెస్టారెంట్లో ఫుడ్ పై ప్లాస్టిక్ కవర్లు ఉండేలా చేయడం లాంటి చర్యలు తీసుకున్నారు రెస్టారెంట్ నిర్వాహకులు. అయితే తాను చేసిన తప్పును బాలుడు ఒప్పుకున్నాడు. తనపై వేసిన ధావన్ కొట్టివేయాలని కోర్టును దావాను స్నేహితుడు ఫ్రాంక్ వీడియో తీద్దామని చెప్పడంతోనే ఇక ఇలా సరదా కోసం చేస్తానని బాలుడు చెబుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: