సాధారణంగా ఎంతో మంది మందుబాబులు ఒక పెగ్గు వేసిన తర్వాత ఏం చేస్తున్నామో కూడా తెలియని విధంగా విచక్షణ కోల్పోతూ ఉంటారు. ఈ క్రమంలోనే మద్యం మత్తులో కొన్ని కొన్ని సార్లు చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా మందుబాబులు చేసే పనులు కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తే ఇంకొన్నిసార్లు మాత్రం చిరాకు పుట్టిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఒక మందుబాబు చేసిన పని ప్రతి ఒక్కరిని కూడా ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. మూడు పెగ్గులు వేసి ఏకంగా ఒక భారీ ఎద్దుతోనే గొడవకు దిగాడు ఇక్కడ ఒక మందుబాబు.. ఏకంగా చాలాసేపటి వరకు ఎద్దును విసిగించాడు.
కాసేపటి వరకు ఓపికగా ఉన్న ఎద్దు ఇక సహనం నశించడంతో.. అతడికి తనదైన పద్ధతిలోనే బుద్ధి చెప్పింది. ఏకంగా కొమ్ములతో ఎత్తి పారేసింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇలా ఎద్దు కొమ్ములతో ఎత్తేయడంతో రోడ్డుమీద పక్కకు పడిన యువకుడు ఒక్కసారిగా భయపడి పోయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ వీడియో చూసి కొంతమంది నేటిజన్స్ నవ్వుకుంటుంటే.. కొంతమంది మాత్రం షాక్ అవుతున్నారు. ఏం బ్రాండ్ తాగావు. కాస్త మాక్కూడా చెప్పు బ్రదర్ అంటూ కొంతమంది ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి