
అయితే కొంతమంది మాత్రం అమ్మాయిలు.. తొడలు కనిపించేలా నిక్కర్లు జబ్బులు కనిపించేలా స్లీవ్ లెస్ డ్రస్సులతో గుడికి వెళ్తున్నారు. మరి కొంతమంది ఆడవాళ్లు పద్ధతిగా చీర కట్టుకున్న జాకెట్ మాత్రమే రకరకాల డిజైన్స్ అంటూ బ్యాక్ మొత్తం కనిపించే విధంగా వేసుకుంటున్నారు . దీంతో కొంతమంది అలాంటి వాళ్ళపై నెగటివ్గా కామెంట్స్ చేస్తున్నారు జనాలు. గుడికి అనేది చాలా పవిత్రంగా ప్రశాంతంగా వెళ్లాలి అని ఇలా పిచ్చిపిచ్చి బట్టలు వేసుకొని ఎక్స్పోజింగ్ చేయడానికి గుడికెందుకు వెళ్లడం ..?? అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు .
కొంతమంది పూజారులు కూడా గుడికి అలాంటి బట్టలు వేసుకుని వెళ్లే అమ్మాయిలను స్ట్రైట్ గానే తిట్టిపోస్తున్నారు. పైట లేకుండా గుడికి రావడం ఏంటి..?? అంటూ ఎంతో మంది పూజారులు అలా అమ్మాయిలపై మండిపడిన సందర్భాలు ఉన్నాయి. అందరు అమ్మాయిలు ఆడవాళ్ళు ఇలా ఉన్నారా..? అంటే నో అని చెప్పాలి. కొందరు మాత్రమే ఇలా ఉంటున్నారు. ఆడవాళ్లు కూడా చీర కట్టుకున్న జాకెట్ మొత్తం అలా ఎక్స్పోజ్ చేస్తూ ఉండడాన్ని తప్పుపడుతున్నారు కొంతమంది జనాలు.
మరీ ముఖ్యంగా ఫ్యాషన్ ఫ్యాషన్ అంటూ ఫారిన్ కల్చర్ పద్ధతిని ఇండియాలోకి తీసుకువచ్చి పుణ్యక్షేత్రాలను కూడా భ్రష్టు పట్టించేస్తున్నారు అంటూ కొంతమంది దైవ భక్తులు మండిపడుతున్నారు . గుడికి వెళ్ళేటప్పుడు చక్కగా చీర కట్టుకోవాలి లేదంటే చుడిదార్ వేసుకోవాలి. ఒళ్లంతా కప్పుకొని నిండుగా వెళితే బాగుంటుంది . ఇలా విచ్చలవిడిగా ఫారిన్ వెస్ట్రన్ కల్చర్ అంటూ తొడలు జబ్బలు మెడ చూపించడానికి పైట లేకుండా గుడికి రావడానికి కొంచమైనా తెలివి లేదా..? అంటూ మండిపడుతున్నారు కామన్ పీపుల్స్ . ఇకనైనా అలా వెస్టెన్ వేర్ బట్టలు గుడికి వెసుకుని వెళ్లకుండా ఉంటే మంచిది అంటున్నారు పూజారులు..!!
నోట్: పైన తెలిపిన సమాచారం సోషల్ మీడియాలో కామెంట్స్ ఆధారంగా అందించబడినది. అంతేకానీ ఎవ్వరిని ఉద్దేశించినవి కావు అని పాఠకులు గుర్తుంచుకోవాలి..!!