- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .
.
ఆయన టాలీవుడ్ లో మంచి పేరున్న దర్శకుడు ఆయన తీసేవి ఎలాంటి సినిమాలు అన్నవి పక్కన పెడితే మాస్ సినిమాలు తీయటంలో అందే వేసిన చేయి. క‌థ రొటీన్ అయినా కూడా క‌థ‌నంతో సినిమాను గ‌ట్టెక్కించేస్తాడ‌న్న పేరుంది. స్టార్ హీరోలు .. సీనియ‌ర్ హీరోల‌తో కూడా సినిమాలు తీసి మ‌రీ హిట్లు కొట్టాడు. అలాంటి దర్శకుడు ప్రస్తుతం ఓ మెగా క్రేజీ ప్రాజెక్ట్ టేక్ అప్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన టీంలో ఓ అమ్మాయి చేరిందట. టాలీవుడ్ లో ఇప్పుడు అన్ని విభాగాల్లోనూ మహిళలు బాగా రాణిస్తున్నారు. అందులో సమస్య లేదు. అయితే ఈ దర్శకుడు దగ్గర వేరే సమస్య ఉంది. ఈ దర్శకుడికి అమ్మాయిలు అంటే కాస్త బలహీనత ఎక్కువే అన్న పుకార్లు ఉన్నాయి. ఇలాంటి బంధాలు .. అనుబంధాలు ఆయనకు చాలానే ఉన్నాయట. దీనిపై గతంలో కూడా పుకార్లు షికారులు చేశాయి.


ఇప్పుడు తన టీమ్ లో చేరిన అమ్మాయికి ఆ డైరెక్టర్ బాగా దగ్గర అయిపోయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. తన టీం లో ఆ అమ్మాయికి బాగా ప్రయారిటీ ఇస్తున్నారట. ఇప్పుడు ఆమె మాట పై చేయి అవుతోందట. ఇటీవల ఈ సినిమా వర్క్ పని మీద వేరే సిటీకి వెళితే అరగంట గ్యాప్లో రెండు ఫ్లైట్లకు చెరో టిక్కెట్ తీసుకుని ఇద్దరు ఛ‌లో అన్నారట .ఒక ఫ్లైట్లో వెళితే అనుమానం వస్తుంది మళ్ళీ ఎందుకు వచ్చిన ఇబ్బంది ? అని చెరో ఫ్లైట్‌ టికెట్ తీసుకుని బయటికి వెళ్లిపోయారట. అంతమాత్రం చేత ఈ దర్శకుడు ఆ అమ్మాయితో అలా ఉండిపోతాడని అనుకోవటానికి లేదు. జస్ట్ అంత టైం పాస్ వ్యవహారం.. మళ్లీ మరో ఆయన మనసుకు నచ్చిన అమ్మాయి పరిచయం అయ్యేవరకు అలా కాలక్షేపం చేస్తాడు. ఏం చేస్తాం ? మనిషికో బలహీనత అనుకోవటమే కదా ఇంతకు ఆ డైరెక్టర్ ఇప్పుడు ఓ మెగా క్రేజీ ప్రాజెక్ట్ టేకప్ చేశాడు. ఆ డైరెక్టర్ ఎవరు పేరు చెప్పు అవసరం లేదనుకుంటా ..!


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: