ప్రపంచంలో ఒకే పోలికలతో ఏడుగురు వ్యక్తులు ఉంటారని పెద్దలు చెబుతుంటారు. ఈ మాట సామాన్యుల కంటే సెలబ్రిటీల విషయంలోనే ఎక్కువగా నిజమవుతుంటుంది. గతంలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఐశ్వర్య రాయ్ వంటి స్టార్లను అచ్చుగుద్దినట్లు పోలి ఉన్న వ్యక్తులు రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్‌లుగా మారిపోయారు. ఇప్పుడు తాజాగా నందమూరి అభిమానుల ఆరాధ్య దైవం, నటసింహం నందమూరి బాలకృష్ణ వంతు వచ్చింది. మలేషియాలో పానీపూరీ అమ్ముతున్న ఒక వ్యక్తిని చూసి నెటిజన్లు "అచ్చం మన బాలయ్యే కదా!" అంటూ నోరెళ్లబెడుతున్నారు.


తాజాగా మలేషియాలో జరిగిన ఒక హిందూ జాతరలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు ఇంటర్నెట్‌లో సునామీ సృష్టిస్తోంది. ఓ తెలుగు యూట్యూబర్ ఆ జాతరకు వెళ్లి వీడియోలు తీస్తుండగా, అక్కడ ఒక పానీపూరీ షాపు దగ్గర ఒక్కసారిగా ఆగిపోయాడు. ఎందుకంటే ఆ షాపులో పానీపూరీ అమ్ముతున్న వ్యక్తి అచ్చుగుద్దినట్లు నటసింహం బాలకృష్ణ లాగే కనిపిస్తున్నాడు.ముఖ్యంగా బాలయ్య విగ్ తీసేస్తే ఎలా ఉంటారో, సదరు వ్యక్తి కూడా అలాగే ఉండటంతో ఆ యూట్యూబర్ వెంటనే కెమెరా ఆన్ చేసి "మలేషియాలో పానీపూరీ అమ్ముతున్న బాలయ్య" అంటూ వీడియో పోస్ట్ చేశాడు. ఆ వ్యక్తి రూపం, ఆ చిరునవ్వు, ఆ రాజసం చూస్తుంటే నందమూరి అభిమానులకు ‘అఖండ’ గుర్తొస్తోంది.



ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. నెటిజన్లు రకరకాల కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. “బాలయ్య బాబు మలేషియాలో పానీపూరీ బిజినెస్ మొదలుపెట్టారా ఏంటి?” అని కొందరు జోకులు వేస్తుంటే, “ఒకే పోలికలతో ఏడుగురు ఉంటారనే మాట ఇతన్ని చూస్తే నిజమనిపిస్తోంది” అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.బాలయ్యకు ఉన్న ‘మాస్’ ఇమేజ్ కారణంగా ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ఆ వ్యక్తి పానీపూరీ ఇస్తున్న స్టైల్ కూడా మన ‘లెజెండ్’ లాగే ఉందంటూ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: