కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలలో అడుగు పెట్టి ప్రజల జీవన శైలిని తారుమారు చేసింది. ముఖ్యంగా దేశ ఆర్థిక మాన్యాలను అతలాకుతలం చేసింది. అది ఇది అని దేనినీ వదలకుండా.. అన్ని రంగాలపై తన ప్రభావాన్ని చూపి ఆర్థిక వ్యవస్థను కుంగదీసింది. కరోనా నేపథ్యంలో కొన్ని కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోయారు... వేలాది కుటుంబాలు దారిద్ర్య రేఖకు దగ్గరగా చేరాయి.