సంపద కంటే జ్ఞానము ఉత్తమమైనది. ఎందుకనగా సంపదను మీరు రక్షించాల్సి వస్తుంది. కానీ జ్ఞానం మాత్రం మిమ్మల్ని రక్షిస్తుంది. జ్ఞాన సాధన అనునది అవాస్తవిక భావాల వలన కలిగే అజ్ఞానాన్ని వాస్తవిక భావాల ద్వారా తొలగించడం. దీన్ని జ్ఞానంగా పరిగణించవచ్చు. ఉదాహరణకు చాలామంది మూఢనమ్మకాలను ఆచరిస్తూ ఉంటారు. అయితే జ్ఞానం ఉన్న వారు వాటిని నమ్మరు ఆచరించరు, తద్వారా ఏ చెడు ఆలోచనల వలలో పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. దీనికి కారణం జ్ఞానమే అవుతుంది. జ్ఞాన నిర్మాణానికి తొలిమెట్టు అనుభూతులను అలవర్చుకోవడం అవుతుంది. ఏది వాస్తవం ఏది అవాస్తవం అని సరి పోల్చగల అవగాహన మీకు ఉండాలి. ప్రతి ఒక పిల్లవాడి సరైన జ్ఞాన నిర్మాణానికి తల్లిదండ్రులు, విద్య బోధించే గురువులు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు.