చాలా మందికి ఒక్కో రూపాయిని ఎంతో కష్టపడి సంపాదించాల్సిన పరిస్థితి, అలాంటిది అదే రూపాయిని ఖర్చు చేయడానికి అస్సలు ఆలోచించకుండా చాలా ఈజీగా ఖర్చు చేసేస్తున్నారు. సంపాదిస్తోంది ఖర్చు చేయడానికే కానీ, వృదా చేయడానికి కాదు. నీవు ఫలానా దానికి నీ డబ్బులను వెచ్చిస్తున్నావు అంటే, ఆ వస్తువు లేదా పని నీకు చాలా ఉపయోగకరమైనదిగా ఉండాలి, లేదంటే వృధానే, కళ్ళు చూసిన ప్రతీది మనసుకు నచ్చవచ్చు తప్పులేదు కానీ నచ్చిన ప్రతి దాన్ని కొనాలి అనే ఆలోచన రావడం పొరపాటు. నీవు ఖర్చు చేసే ప్రతి రూపాయి నీకు ఉపయోగకరంగా మారాలి.
ఉదాహరణకు ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలి అని లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు దృష్టి అంతా దాని పైనే ఉండాలి. అలా కాకుండా షాపింగ్ అని, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం లని డబ్బులను వృదా చేస్తే ఆ కల ఎప్పటికీ కల గానే మొగిలిపోతుంది. అందుకే డబ్బును వృదా గా ఖర్చు చేయకండి. అలాగే మనుషుల కంటే డబ్బుకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకండి.