తయారీలో వాడే పధార్థాలు :
పాలకూర : 400 గ్రాములు
పన్నీర్ : 200 గ్రాములు
ఉల్లిపాయలు : 2 చిన్నవి
డ్రైఫూట్స్ : 1 కప్పు
అల్లం, వెల్లుల్లి
పేస్ట్ : 1 చెంచా
గరంమసాల : 1చెంచా
పచ్చిమిర్చి పేస్ట్ : 3 చెంచాలు
ఇంగువ : చిటికెడు
దనియాల పొడి : 11/2 చెంచా
పసుపు : సరిపడా
టొమోటొ : 5
కొత్తిమీర : ½ కప్పు
పాలు : 3-4 కప్పులు
ఉప్పు : తగినంత
తయారీచేయు విధానం :
ముందుగా పాలకూర శుభ్రంగా కడిగి ఉడికించి ఫేస్టు చేసి వుంచుకోవాలి. పాలల్లో డ్రైఫ్రూట్స్ నానపెట్టి మిక్సీకి వేసి మెత్తగా ఫేస్ చేయాలి. ఫ్రైయింగ్ పాన్ లో నెయ్యి వేసి జీర ఇంగువ, ఉల్లిపాయ, అల్లంవెల్లుల్లి ఫేస్టు పచ్చిమిర్చి వేసి సన్నని మంటమీద కలుపుతూ ఎర్రగా వేయించాలి. వేగిన వీటికి కారం, ఉప్పు , పసుపు, దనియాలపొడి వేసి కలిపి డ్రైఫ్రూట్స్ పేస్టు కలిపాలి.
ఐదునిమిషాలు సన్నని మంట మీద వేపి టామోటా ముక్కలను వేసి వేయించాలి. ముక్కలు మగ్గి వేగిన తర్వాత నెయ్యి బయటకు వస్తుంది. అప్పుడు పాలకూర ఫేస్టు వేసి వేయించాలి. గరంమసాల, కోతిమీర వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. దింపేముందు పన్నీర్ ముక్కలు వేసి దింపాలి. వేడివేడి ఈ కర్రి పరోటా, పుల్కా, బాదంపూరిలు మొదలైనవాటిలోకి సర్వ్ చేయాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: