పుదీనా రైతా పెరుగు నిత్యాహారంలో వాడటం చాలామంచిది. మసాలా వంటకాలు తిన్న తర్వాత పెరుగు లేదా రైతా తింటే చల్లగా ఉంటుంది.
ఈ రైతా లేదా పెరుగు పచ్చడి ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. కొంచెం కొత్తగా, వెరయిటీగా పుదీనా రైతా ఎలా చేయాలో తెలుసుకుందాం.
కావాలసిన వస్తువులు :
పెరుగు : 1 కప్పు
పుదీనా ఆకులు : 6-8
పచ్చిమిర్చి : 1 నల్ల
ఉప్పు : చిటికెడు
జీలకర్ర పొడి : అర స్పూన్
కీరా తురుము : ¼ కప్పు
ఉప్పు :
తగినంత
తయారు చేయువిధానం:
పుదీనా ఆకులు , పచ్చిమిర్చి, నల్ల ఉప్పు కలిపి మెత్తగా నూరుకోవాలి. పెరుగులో ఈ ముద్ద వేసే కలపాలి. ఇందులో తగినంత ఉప్పు, ఇలకర్ర పొడి వేసి కలపాలి. కీరా దోసకాయ చెక్కు తీసి తురిమి పెరుగులో కలిపి చల్లగా సర్వ్ చేయాలి. ఈ రైతా పులావ్, బిర్యానీలకు బావుంటుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: