చికెన్ .. ఎలా చేసిన తింటారు ఆహార ప్రియులు.. అయితే అలాంటి చికెన్ ముక్కలను.. మనం ఆలా ఇలా అని ఎన్నో రకాలుగా చేసుకొని తింటాము.. అయితే ఈ చికెన్ టిక్కా మసాలా ఎలా చెయ్యాలో తెలుసా? అయితే అలాంటి అద్భుతమైన చికెన్ టిక్కా ఎలా చేయాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. ఇంట్లో ప్రయత్నించండి.. 

 

కావాల్సిన పదార్ధాలు.. 

 

బోన్‌లెస్‌ చికెన్‌ అరకిలో, 

 

పెరుగు: అరకప్పు, 

 

నిమ్మరసం: టీస్పూను, 

 

పసుపు: అరటీస్పూను,

 

కారం: అరటీస్పూను, 

 

మిరియాలపొడి: అరటీస్పూను, 

 

గరంమసాలా: అరటీస్పూను,

 

ఉప్పు: చిటికెడు, 

 

గ్రేవీకోసం: నూనె: టేబుల్‌స్పూను, 

 

వెన్న: టేబుల్‌స్పూన్లు, 

 

యాలకులు: మూడు, 

 

లవంగాలు: రెండు, 

 

దాల్చినచెక్క: అంగుళంముక్క, 

 

ఉల్లిపాయ: ఒకటి, 

 

ఉప్పు: తగినంత, 

 

అల్లంవెల్లుల్లి: 2 టేబుల్‌స్పూన్లు, 

 

దనియాలపొడి: 2 టీస్పూన్లు, 

 

జీలకర్ర: టీస్పూను, 

 

కారం: అరటీస్పూను, 

 

టొమాటోలు: నాలుగు, 

 

టొమాటోగుజ్జు: 2 టేబుల్‌స్పూన్లు, 

 

మంచినీళ్లు: కప్పు, 

 

పంచదార: టేబుల్‌స్పూను, 

 

గరంమసాలా: అరటీస్పూను, 

 

క్రీమ్‌: కప్పు, కొత్తిమీర: కొద్దిగా.

 

తయారీ విధానం.. 

 

పెరుగులో నిమ్మరసం, పసుపు, కారం, మిరియాలపొడి, గరంమసాలా, ఉప్పు వేసి కలిపి చికెన్‌ ముక్కలకు పట్టించి ఉంచాలి. విడిగా బాణలిలో నూనె, వెన్న వేసి కాగాక కాస్త కచ్చాపచ్చాగా దంచిన యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క వేసి వేయించాలి. తరవాత ఉల్లిముక్కలు, ఉప్పు వేసి వేగాక అల్లంవెల్లుల్లి వేసి ఓ నిమిషం వేయించాలి. ఇప్పుడు దనియాలపొడి, జీలకర్ర, కారం, టొమాటోముక్కలు, టొమాటోగుజ్జు వేసి నూనె తేలేవరకూ ఉడికించాలి. ఆతర్వాత చికెన్‌ ముక్కలు వేసి కాసేపు ఉడికించాలి. ఇప్పుడు గరం మసాలా, పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టి సుమారు ఇరవై నిమిషాలపాటు ముక్క మెత్తగా ఉడికేవరకూ ఉంచాలి. చివరగా క్రీమ్‌ వేసి దించి కొత్తిమీరతో అలంకరించాలి. అంతే చికెన్ టిక్కా రెడీ. ఇంకేందుకు ఆలస్యం.. వెంటనే చికెన్ టిక్కా ఇంట్లోనే చేసుకొని తినేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: