ఆడవాళ్లు అందంగా కనపడడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో ఒకటి ముఖానికి టూత్ పేస్ట్ రాయడం.ఇప్పటి ఆధునిక కాలంలో అందరు కెమికల్స్ కలిగిన బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. కానీ పూర్వంలో మహిళలు ముఖానికి చక్కగా నలుగు పెట్టుకునే వారు. కానీ ఇప్పుడు చర్మం కోసం రకరకాలా క్రీములు, చిట్కాలు పాటిస్తూ ఉంటారు. అయితే అవి పని చేస్తే మంచిదే కానీ వాటి మల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. కొందరు మొటిమలు తగ్గాలని ముఖానికి టూత్‌ పేస్ట్‌ ను పూస్తుంటారు. ఇంకొందరు ముఖ సౌందర్యం కోసం బేకింగ్‌ సోడా, ఉప్పు వాడుతుంటారు.



కానీ  ఇవి వాడితే నష్టమే అంటున్నారు నిపుణులు. సాధారణంగా టూత్‌పేస్ట్‌లో సోడా, మెంథాల్, షాంపూ, సల్ఫర్ ఉంటుంది. ఇవి దంతాలపై రాస్తాం. దంతాలు గట్టిగా ఉంటాయి కాబట్టి.. ఏం కాదు.. కానీ ముఖంపైనున్న చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందులోను చాలా మెత్తగా ఉంటుంది మన స్కిన్ టోన్. కాబట్టి టూత్ పేస్ట్ రాసినప్పుడు తాత్కాలికంగా ఆ సమస్య తగ్గినా ఫ్యూచర్‌లో ఇబ్బందులు తప్పవు. అంటే టూత్ పేస్ట్ రాసాక మొటిమలు తగ్గాయి అన్నా అభిప్రాయం ఉంటుంది కానీ భవిష్యత్ లో చర్మం మీద టూత్ పేస్ట్ ప్రభావం ఉంటుంది. టూత్‌పేస్ట్‌లో కాల్షియం కార్బోనేట్‌ ఉంటుంది.




ఇది గోడలకు వేసే సున్నం, సిమెంట్‌ ప్లాస్టర్‌లో కూడా ఉంటుంది.అయితే మొటిమలపై పేస్ట్‌ రాస్తే అక్కడ చర్మాన్ని మరింత చికాకు పెడుతుందని వైద్యులు చెబుతున్నారు. దాని వల్ల మచ్చలు ఏర్పడతాయని చెబుతున్నారు. పేస్ట్‌లోని కెమికల్స్.. ముఖంపైనున్న చర్మాన్ని పొడిబార్చి మరింత సమస్యకు గురిచేస్తుంది. దీని వల్ల సమస్య మరింత తీవ్రతరమవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా టూత్ ‌పేస్ట్ ముఖంపై రాయడం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు.మార్కెట్లో వివిధ రకాల టూత్ పేస్ట్ లు లభ్యం అవుతున్నాయి.ఏది పడితే అది చర్మానికి ఉపయోగించకూడదు. దంతాలకు ఉపయోగించే పేస్ట్ ముఖానికి అప్లై చేస్తే నష్టం వాటిల్లుతుంది.సాధ్యమైనంత వరకు పేస్ట్ వాడకపోవడమే మంచిది..

మరింత సమాచారం తెలుసుకోండి: