ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న సింగర్ సునీత రోజు ఎదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తుంది.ఈరోజు ఆమె పుట్టిన రోజు కావడంతో ఆమె ట్రేండింగ్ లో ఉన్నారు. ప్రతి పుట్టిన రోజులాగే ఈ రోజు కూడా అభిమానులను అలరించింది సునీత.. టాలీవుడ్ లో సింగర్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న సునీత ఇటీవలే ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేని ని వివాహం చేసుకుంది. చాలా ఏళ్లుగా ఒంటరిగా జీవితం గడిపిన సునీత తన ఒంటరితనానికి స్వస్తి చెప్తూ కొత్త జీవితాన్ని ప్రారంభించింది..

సునీత తీసుకున్న డేరింగ్ స్టెప్ కి ప్రముఖుల దగ్గరినుంచి మంచి ప్రశంశలు దక్కాయి.. సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా సునీత కి మంచి పేరుంది.. ఎన్నో పెద్ద పెద్ద సినిమాల్లో హీరోయిన్ లకు తన గాత్రాన్ని దానం చేశారు సునీత.. ఇక సోషల్ మీడియా లో తన కొత్త లైఫ్ గురించి అప్ డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ని కూడా ఉత్సాహపరుస్తుంది. అంతేకాదు తన జీవితంలో జరుగుతున్న కొత్త కొత్త సంగతులను సన్నిహితులతో పాటు అభిమానులతో కూడా పంచుకుంటుంది.

తాజగా ఆమె లైవ్ లో ప్రేక్షకులతో ముచ్చటించగా ఓ అభిమాని డేర్ చేసి ఆమెను నెంబర్ అడిగాడు.. దీంతో సునీత నవ్వుతూనే స్వీట్‌గా తిరస్కరించేశారు. సో సారీ అండి అంటూ సునీత తప్పించుకున్నారు.అలాగే కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇలా తనను ఎంతో మంది పాటలు అడుగుతున్నారని, తాను పాడుతూ ఉంటే కాస్త ఉపశమనం కలుగుతుందని భావిస్తే ప్రతి రోజూ ఇలానే ఓ అర్ధగంట లైవ్ పెడతాను అని సునీత అన్నారు.కాగా ఆమె రోజు రాత్రి ఎనిమిది గంటలకు లైవ్ లోకి వాస్తు తన అభిమానులను అలరిస్తుంది. చెప్పినట్టుగానే సునీత నిన్న రాత్రి 8 గంటలకు లైవ్‌కి వచ్చారు. తన ఫాలోవర్లు పెడుతున్న కామెంట్లను చదివారు. అడిగిన పాటలను పాడేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: