మొత్తానికి ఇండియన్ FTR కార్బన్ మోటార్ సైకిల్ ను ఆవిష్కరించారు. ఇండియన్ FTR 1200 లైన ప్ లో వచ్చిన ఈ బైక్ ను యూరప్ మార్కెట్లో ఆవిష్కరించారు. ఇక ఈ సరికొత్త స్పోర్ట్స్ బైక్ షాట్ గన్ స్టైల్ తో ఆక్రోపోవిక్ ఎక్సాహాస్ట్, కార్బన్ ఫైబర్ పార్టులతో దీనిని రూపొందించారు. ఇలా చేసారు కాబట్టి దీన్ని FTR కార్బన్ గా పిలుస్తున్నారు. ఇక FTR 1200 సిరీస్ ను FTR 750 మోటార్ సైకిల్ ఆధారంగా తయారు చేశారు. అయితే ఈ సరికొత్త బైక్ లో కొన్నిటిని అప్డేట్ చేసి కొత్తవి పొందుపరిచారు.

IHG

ఇక దీని ఇంజిన్  విషయానికి వస్తే ... ఈ ఇండియన్ FTR కార్బన్ మోటార్ సైకిల్ 1203 cc, లిక్విడ్ కూల్డ్ v - ట్విన్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 126 BHP బ్రేక్ హార్స్ పవర్, 120 nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇక లీన్ యాంగిల్ ట్రాక్షన్ కంట్రోల్, వీల్లీ కంట్రోల్ లాంటి కొన్ని ప్రత్యేకతలు ఇందులో చేర్చారు. ఇకపోతే స్పోర్ట్, స్టాండర్డ్, రెయిన్ అనే మూడు రైడింగ్ మోడ్లలో ఈ బైక్ మనకు లభిస్తుంది. 

IHG


అలాగే ఇక ధర విషయానికి వస్తే ... UK మార్కెట్లో 2020 FTR కార్బన్ ధర వచ్చేసి 14,699 పౌండ్లుగా ఉండగా, ఇదే భారత కరెన్సీలో అయితే రూ.13.8 లక్షలుగా ఉంది. FTR 1200 s మోడల్ అయితే 12,999 పౌండ్లు అంటే రూ.12.2 లక్షలు గా ఉంది. ఇక అదే ఇండియాలో అయితే FTR 1200 S ధర 15.99 లక్షలుగా ధరలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: