ఇండియాలో ఎక్కువగా రోడ్లు కొంచెం వెడల్పు తక్కువగా ఉండి ప్రమాదాలకు కొద్ది కారణమవుతున్నాయి. అయితే ప్రస్తుతం కాస్త పరిస్థితి మారింది అనుకోండి. ఇక దీని నేపథ్యంలో కార్ల యజమానులు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉండే వాహనాల కోసం చూస్తున్నారు. కార్ టైర్ల గ్రౌండ్ క్లియరెన్స్ వీలైనంత ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాదాలను కట్టడి చేయొచ్చు అంటున్నారు నిపుణులు. దీనికోసం మనం విదేశాల నుంచి వాహనాలను దిగుమతులు చేసుకుంటున్నాం. కాగా తగినంత గ్రౌండ్ క్లియరెన్స్ ఉండి ప్రమాదాలు తక్కువగా ఉండే ఆస్కారం ఉంటుంది. 

 

 

ఇక అందుకే సాధారణంగా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండే SUV లకు డిమాండ్ పెరుగుతుంది. తాజాగా సెడాన్లకూ గిరాకీ తగ్గడం లేదు. ఇందులో ముఖ్యంగా ప్రీమియం సెడాన్లకు మంచి డిమాండ్ ఎక్కువగా ఉంది. మరి అత్యధిక గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న టాప్ - 5 కార్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ​టాటా టిగోర్, ​హ్యుండాయ్ ఆరా, ఫోర్డ్ యాస్పైర్, ​మారుతీ సుజుకీ సియాజ్, ​టొయోటా కొరోల్లా ఆల్టిస్ ప్రస్తుతం ఇవి బాగా డిమాండ్ ఉన్న SUV లకు మంచి డిమాండ్ ఉంది.

 


ఇక ఇందులో మారుతీ సుజుకీ సియాజ్ విషయానికి వస్తే ఈ మిడ్ సైజ్ సెడాన్ ఇటీవలే BS 6 ప్రమాణాలకు అనుగుణంగా అప్ డేట్ చేశారు. ఇక ఇది భారత మార్కెట్లో ఇది 1.5 lr పెట్రోల్ ఇంజిన్ తో మాత్రమే లభిస్తుంది. అదే ​టొయోటా కొరోల్లా ఆల్టిస్ చుస్తే ఇది భారత్ లో ఉన్న ప్రీమియం సెడాన్లలో అత్యంత పురాతనమైన మోడల్ ఈ టొయోటా కొరోల్లా. ఇకపోతే ఈ కారులో సరికొత్త అప్డేట్లను పొందుపరిచింది టొయోటా సంస్థ. ​ఫోర్డ్ యాస్పైర్ విషయానికి వస్తే  అంతేకాకుండా BS 6 ఫోర్డ్ యాస్పైర్ మోడల్లో 1.2 lr పెట్రోల్, 1.5 lr డీజిల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఈ కార్ ప్రారంభ ధర 5.99 లక్షల రూపాయలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: