ప్రస్తుతం దేశంలో చాలామంది ఎలక్ట్రికల్ కార్లకు ప్రాముఖ్యం ఇస్తున్నారు. డీజిల్, పెట్రోల్ ఇంధనాల ఖర్చు ఎక్కువ అవడంతో వాటిని మెయింటెన్ చేయడం కాస్త కష్టతరం అవ్వడంతో, అలాగే వాటి వల్ల ఏర్పడే వాతావరణ కాలుష్యం వలన ప్రజలకు ఎంతో హాని కలుగుతుంది. వీటిని అన్ని విషయాల దృష్ట్యా ప్రస్తుతం కార్లు కొనేవారు ఎలక్ట్రిక్ కార్లపై ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అంతేకాక వివిధ దేశాల నుంచి కంపినీలు మన  దేశంలోనే ఎలక్ట్రికల్ కార్లు యొక్క తయారీని చేపడుతున్నాయి. ఇకపోతే ఇప్పటికే ఆటో దిగ్గజ కంపెనీలు చాలా ఎలక్ట్రికల్ కార్ల ఉత్పత్తిలో మొదటి అడుగు వేశాయి.

 

ప్రస్తుతం మన దేశంలో అగ్ర సంస్థలైన టాటా, హుండాయ్, మహీంద్రా, ఎంజి, కియా సంస్థలు ఎలక్ట్రికల్ కార్లు ఉత్పత్తిలో పోటీ పడుతున్నాయి. భారత్ లో ఇంతవరకు టాటా నెక్సన్ ఈవి అత్యధిక ఎలక్ట్రికల్ కార్లు అమ్ముడు పోయిన కార్ గా పేరుపొందింది. ఇలా ఎలక్ట్రికల్ కార్లకి ఎక్కువ డిమాండ్ పెరగడానికి కారణం కేవలం పర్యావరణ క్రితమే కాకుండా సింగిల్ చార్జింగ్ పెట్టడంతో ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించే కూడా రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. అయితే భారత్ లో ప్రస్తుతం కనీసం 150 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కొన్ని వెహికల్ కార్లు ఒకసారి చూద్దామా....


ఇలా ఎక్కువ దూరం ప్రయాణించగల కార్స్ విషయానికి వస్తే... టాటా టిగోర్ ఈవీ, ​మహీంద్రా ఈ - వెరిటో, టాటా నెక్సాన్ ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, ​హ్యుండాయ్ కోనా ఈవీ ముందు వరుసలో ఉన్నాయి. ఇందులో టాటా టిగోర్ ఈవీకి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 213 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ఇక మహీంద్రా ఈ-వెరిటో ఒక్కసారి ఛార్జింగ్ పెడితే గరిష్ఠంగా గంటకు 181 కిలమీటర్లు వరకు ప్రయాణం చేయవచ్చు. అలాగే టాటా నెక్సాన్ ఈవీ గరిష్ఠంగా 312 కిలోమీటర్లు నడుస్తుంది. ఇకపోతే ఎంజీ జెడ్ఎస్ ఈవీ సింగిల్ ఛార్జింగ్ తో 340 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇక చివరగా హ్యుండాయ్ కోనా ఈవీ గరిష్ఠంగా 452 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: