హీరో మోటార్స్ సంస్థ చాలా సమయం తీసుకొని భారత మార్కెట్లో బిఎస్ 6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా హీరో ఎక్స్ పల్స్ మోడల్ ను విడుదల చేసింది. అత్యాధునిక హంగులతో ఉన్న ఈ బైక్ చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇక ఈ మోటర్ బైక్ ధర విషయానికి వస్తే.. షోరూమ్ లో రూ. 1.12 లక్షలు గా కంపెనీ నిర్ణయించింది. ఈ ధర గత మోడల్ తో పోలిస్తే ఎక్కువ. అయితే భారతదేశంలో అతి తక్కువ ధరకు దొరికే అడ్వెంచర్ మోటార్ సైకిల్ ఇది. 

 

IHG


కరోనా ప్రభావంతో దీని విడుదల ఆలస్యం జరిగింది. ప్రస్తుతం ఈ బైక్ కు సంబంధించిన డెలివరీలను అందిస్తోంది సంస్థ. ఈ బైక్ మొత్తం 5 రకాల కలర్స్ ఆప్షన్ లతో మనకు అందుబాటులో ఉంది. ఇందులో ప్యాంథర్ బ్లాక్, మ్యాటీ గ్రే, తెలుపు, మ్యాటీ ఈ గ్రీన్, స్పోర్ట్స్ రెడ్ రంగులలో మనకు బైక్ లభ్యం కాబోతోంది. ఈ బైక్ ఇంజన్ విషయానికి వస్తే... 199 సిసి ఫ్యూయల్ ఇంజెక్టెడ్ సింగిల్ సిలిండర్ ను ఇది కలిగి ఉంది. అంతేకాకుండా 17.8 bhp బ్రేకర్ హార్స్ పవర్, 16.4 nm టార్క్ nu ఉత్పత్తి చేయగలుగుతుంది. వీటితో పాటు 5 - స్పీడ్ గేర్ బాక్స్ తో ఈ బైక్ పని చేయనుంది.

 

IHG

 

 

ఇక ఈ బైక్ ప్రత్యేకతలు విషయానికి వస్తే..  ఈ బైక్ 13 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ను కలిగి ఉంది. ఈ బైక్ 157 కేజీల బరువు కలిగి ఉంది. ఎల్ఈడి హెడ్ ల్యాంపులు, ఎల్ఈడి టెయిల్ లైట్లు లాంటి మరికొన్ని ఫీచర్లతో ఈ బైక్ ను రూపొందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: