టాటా మోటార్స్ వాహనాలకు ఇండియన్ మార్కెట్లో ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆకర్షణీయమైన డిజైన్, అప్డేట్ ఫీచర్స్ మాత్రమే కాకుండా ఇంకా అలాగే అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ టాటా వాహనాల  సొంతం.ఈ కారణాల వల్ల బ్రాండ్ వాహనాలు ఇప్పటికి కూడా అద్భుతమైన అమ్మకాలు పొందుతూ ముందుకు సాగుతున్నాయి.టాటా మోటార్స్  'టాటా పంచ్' మైక్రో SUV మార్కెట్లో విడుదలైనప్పటినుంచి కూడా ఉత్తమమైన అమ్మకాలు పొంది అతి తక్కువ కాలంలోనే బ్రాండ్  బెస్ట్ SUV గా నిలిచిపోయింది. అయితే కంపెనీ ఇప్పుడు ఇందులో క్యామో ఎడిషన్ అనే స్పెషల్ ఎడిషన్ విడుదల చెసింది.టాటా పంచ్ క్యామో ఎడిషన్ అనేది కేవలం అడ్వెంచర్ ఇంకా అకాంప్లిష్డ్ ట్రిమ్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది.కొత్త 'టాటా పంచ్ క్యామో ఎడిషన్' ఇప్పుడు ఫోలేజ్ గ్రీన్ అనే కొత్త కలర్ లో విడుదలైంది. కావున ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా భిన్నంగా కనిపిస్తుంది. అంతే కాకుండా రూఫ్ కూడా బ్లాక్ మరియు వైట్ కలర్ లో వస్తుంది. కొనుగోలుదారులు తమకు నచ్చిన కలర్ ఎంచుకోవచ్చు.ధర 6.85 లక్షల నుంచి  8.63 లక్షల దాకా వేరియంట్ ని బట్టి ఉంటుంది.


ఇక దీని గ్రిల్‌కి కింది భాగంలో క్రోమ్ ట్రిమ్ బ్లాక్ అవుట్ చేయబడి, ఫ్రంట్ బంపర్‌లో కొత్త సిల్వర్ స్కిడ్ ప్లేట్ వంటివి ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ లో 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ పూర్తిగా బ్లాక్ కలర్ లోనే ఉన్నాయి. ఫ్రంట్ పెండర్ పైన 'CAMO' బ్యాడ్జింగ్‌ చూడవచ్చు. మొత్తం మీద ఎక్స్టీరియర్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.ఇక టాటా పంచ్ క్యామో ఎడిషన్  ఇంటీరియర్ కూడా దాని మునుపటి మోడల్ కి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే సీట్లు ఒక ప్రత్యేకమైన మిలిటరీ గ్రీన్ కలర్ లో ఉంటాయి.ఇది ఎక్స్టీరియర్ కి ఖచ్చితంగా సరిపోయే విధంగా ఉంటుంది. అయితే ఫీచర్స్ దాదాపుగా మునుపటి మోడల్ లాగానే ఉన్నాయి.ఇందులో 7 ఇంచెస్ TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, హర్మాన్ ఆడియో సిస్టం కూడా ఉన్నాయి. ఇందులోని 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో ఇంకా ఆపిల్ కార్‌ప్లేకి సపోర్ట్ చేస్తుంది. కూల్డ్ గ్లోవ్ బాక్స్, లెదర్ స్టీరింగ్ ఇంకా గేర్ నాబ్ వంటివి అలాగే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: