కొత్తగా బైక్ కొనాలని అనుకుంటున్నారా? లేదంటే స్కూటర్ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీరు కచ్చితంగా ఈ సంగతి తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే డిసెంబర్  నెల ఒకటో తేదీ నుంచి వీటి కొనుగోలుదారులకు షాక్ తగలనుంది.ఇండియాలో అగ్ర టూవీలర్ తయారీ కంపెనీ హీరో మోటొకార్ప్  తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. బైక్, స్కూటర్  ధరలను పెంచేసినట్లు తెలిపింది. ఈ రేట్ల పెంపు నిర్ణయం డిసెంబర్ 1 వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని హీరో కంపెనీ తెలియజేసింది. దీంతో కొనుగోలుదారులపై కచ్చితంగా ప్రభావం పడనుంది. హీరో మోటొకార్ప్ టూవీలర్ ధరలను రూ. 1500 దాకా పెంచింది. ఈ ధరల పెంపు వెహికల్, వేరియంట్  బట్టి మారుతుంది. అంటే ఒక్కో బైక్ రేటు ఒక్కోలా పెరిగే అవకాశం ఉంది. హెచ్ఎఫ్ డీలక్స్, గ్లామర్, ప్యాషన్ ప్రో, ఎక్స్‌పల్స్ 200, మ్యాస్ట్రో, ప్లెజర్  ఇంకా అలాగే డెస్టినీ సహా దేశంలోని మోస్ట్ పాపులర్ అలాగే బెస్ట్ సెల్లింగ్ బైక్ స్ల్పెండర్ ధర కూడా పైకి చేరింది. మీరు హీరో బైక్ లేదా హీరో స్కూటర్  కొనాలని భావిస్తే.. ఇంకో మూడు రోజులే మిగిలున్నాయి.


ఆ తర్వాత నుంచి ఈ టూ వీలర్ల ధరలు పైకి చేరనున్నాయి.అయితే దేశంలో హీరో స్ల్పెండర్ నెంబర్ 1 మోటార్ సైకిల్‌గా కొనసాగుతూ వస్తోంది. అక్టోబర్ నెలలో ఈ బైక్ అమ్మకాలు మొత్తం 2,61,721 యూనిట్లుగా ఉన్నాయి. కంపెనీ  అమ్మకాలను గనుక గమనిస్తే ఇక ఈ బైక్ వాటానే 32.41 శాతంగా ఉంది. ఇక రెండో స్థానంలో హోండా సీబీ షైన్ కొనసాగుతోంది. దీని అమ్మకాలు మొత్తం 1,30,916 యూనిట్లుగా ఉన్నాయి. హీరో మోటొకార్ప్ కంపెనీ బైక్స్ ధరలు పెంచడం ఇది వరుసగా నాలుగో సారి. చివరిగా కంపెనీ సెప్టెంబర్ నెలలో టూవీలర్ ధరలను కంపెనీ రూ. 1000  పైకి పెంచేసింది.ఇక హీరో కంపెనీ ఇటీవలనే ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ విదా వీ1 లాంచ్ చేసింది. ఓలా ఎస్1 ప్రో, ఏథర్ 450 ఎక్స్ ఇంకా అలాగే ఓలా ఎస్1 ప్రో వంటి బండ్లకు ఈ స్కూటర్ పోటీగా మార్కెట్‌లోకి వచ్చింది. ఈ స్కూటర్ రేంజ్  వచ్చేసి మొత్తం 163 కిలోమీటర్లు. దీని ఎక్స్‌షోరూమ్ ధర వచ్చేసి రూ. 1.45 లక్షలు. ఇక దీని టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: