ఇండియన్ మార్కెట్లో చాలామంది బైక్ లవర్స్ కొత్త కొత్త బైకులు మాత్రమే కాదు, కొత్త కొత్త కలర్ ఆప్షన్స్ కలిగిన బైక్స్ వినియోగించడానికి కూడా ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు.ఇందులో భాగంగానే ఇటీవల జావా 42 ఇంకా యెజ్డీ రోడ్‌స్టర్‌ బైకులు కొత్త కలర్ స్కీమ్ తో విడుదలవ్వడం జరిగింది.జావా 42 బైక్ ఇప్పుడు కాస్మిక్ కార్బన్ షేడ్‌లో ఇంకా అలాగే యెజ్డీ రోడ్‌స్టర్‌ క్రిమ్సన్ డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌లో అందుబాటులో ఉంది.వీటి ధరల విషయానికి వస్తే, జావా 42 కాస్మిక్ కార్బన్ షేడ్‌ ధర వచ్చేసి రూ. 1.92 లక్షలు కాగా, యెజ్డీ రోడ్‌స్టర్‌ క్రిమ్సన్ డ్యూయల్ టోన్ ధర వచ్చేసి రూ. 2.04 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంది. ఈ రెండు బైకులలో కలర్ ఆప్షన్స్ కాకుండా ఎలాంటి ఇతర మార్పులు జరగలేదు.ఇక జావా 42 బైక్ ఇప్పుడు కాస్మిక్ కార్బన్ కలర్ ఆప్సన్ లో మాత్రమే కాకుండా, గెలాక్టిక్ గ్రీన్ (మ్యాట్), స్టార్ లైట్ బ్లూ (మ్యాట్), కామెట్ రెడ్ (గ్లోసీ), హాలీస్ టీల్ (మ్యాట్), లుమోస్ లైమ్ (మ్యాట్), నెబ్యులా బ్లూ (గ్లాసీ), ఆల్ స్టార్ బ్లాక్, సిరియస్ వైట్ కలర్ ఇంకా అలాగే ఓరియన్ రెడ్ అనే ఇతర కలర్ ఆప్సన్స్ లో కూడా అందుబాటులో ఉంది.


ఇంకా అదే సమయంలో యెజ్డీ రోడ్‌స్టర్‌ బైక్ కేవలం క్రిమ్సన్ డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌లో మాత్రమే కాకుండా స్మోక్ గ్రే, సిన్ సిల్వర్, హంటర్ గ్రీన్, గాలియంట్ గ్రే ఇంకా అలాగే స్టీల్ బ్లూ అనే ఇతర కలర్ ఆప్షన్స్ లో కూడా లభిస్తుంది. ఇవన్నీ కూడా చూడటానికి చాలా సూపర్ గా ఉంటాయి. అయితే ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన కొత్త కలర్ డ్యూయెల్ టోన్  లో మరింత అందంగా ఉంది.జావా 42 బైక్ అదే 293 సిసి లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ ని కలిగి ఉంటుంది. అందువల్ల ఇది 6000 ఆర్‌పిఎమ్ వద్ద 27 బిహెచ్‌పి పవర్ ఇంకా 5000 ఆర్‌పిఎమ్ వద్ద 27.03 ఎన్ఎమ్ టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది.ఇక యెజ్డీ రోడ్‌స్టర్‌ బైక్ విషయానికి వస్తే, ఇందులో 334 సిసి సింగిల్ సిలిండర్ ఇంకా అలాగే 4 స్ట్రోక్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ అందుబాటులో ఉంటుంది. ఇది 29.3 బిహెచ్‌పి పవర్ ఇంకా 29 ఎన్ఎమ్ టార్క్ ని అందిస్తుంది. ఇది ట్విన్ ఎగ్జాస్ట్ సిస్టమ్ ని కూడా పొందుతుంది. అలాగే ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్ కి యాడ్ చేయబడి ఉంటుంది. అందువల్ల ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: