ఇక ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో జనాలలో తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని ముందుకు దూసుకుపోతుంది.మంచి మంచి లేటెస్ట్ టెక్నాలజీ అండ్ అప్డేటెడ్ ఫీచర్ లతో కూడిన స్కూటర్లను లాంచ్ చేయడంతో పాటు కస్టమర్లను ఆకర్షించేందుకు చాలా రకాల ఆఫర్లను కూడా ప్రకటిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఓలా కేర్ సబ్‌స్క్రిప్షన్ అనే కొత్త కస్టమర్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను స్టార్ట్ చేసింది. ఇంకా ఈ కొత్త ఓలా కేర్ సబ్‌స్క్రిప్షన్ లో రెండు ప్లాన్‌లను అందిస్తోంది. ఓలా కేర్ ఇంకా ఓలా కేర్ ప్లస్ అనే రెండు ప్లాన్‌ల ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసిన వినియోగదారులకు అనేక సేవలను అందించనుంది.ఇక ఈ రెండు ప్లాన్లకు సంబంధించిన ధరలు అలాగే ప్రయోజనాలను ఓలా కంపెనీ ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ఓలా కేర్ ప్లాన్ తీసుకోవాలంటే ఏడాదికి రూ. 1999, ఇంకా అలాగే ఓలా కేర్ ప్లస్ రూ. 2,999 చెల్లించాల్సి వస్తుంది.తక్కువ ధరకు వస్తున్న ఓలా కేర్ ప్లాన్ లో సర్వీస్ చేయించినప్పుడు లేబర్ చార్జి అనేది జీరో ఉంటుంది. అలాగే థెఫ్ట్ అసిస్టెన్స్ హెల్ప్ లైన్, రోడ్ సైడ్ ఇంకా అలాగే పంక్చర్ అసిస్టెన్స్ వంటి ప్రయోజనాలు కూడా మీరు పొంద వచ్చు.ఇంకా అలాగే ఓలా కేర్ ప్లస్ ప్లాన్లో వినియోగదారులు చాలా ప్రయోజనాలు పొందగలుగుతారు.


ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన వారికి ఫ్రీ హోమ్ సర్వీసింగ్ కూడా లభిస్తుంది. అంటే ఇంటి దగ్గరికి వచ్చి మరి ఓలా స్కూటర్ తీసుకెళ్తారు. ఇక సర్వీసింగ్ అయిపోయిన తర్వాత మళ్లీ ఇంటికి స్కూటర్‌ను తిరిగి తెచ్చిస్తారు. మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండానే సర్వీసింగ్ పని అయిపోతుంది. వార్షిక సమగ్ర డయాగ్నసిస్, ఫ్రీ కన్సూమబుల్స్ ఇంకా అలాగే 24 గంటలు డాక్టర్ అండ్ అంబులెన్స్ సర్వీస్ వంటివి కూడా పొందొచ్చు.ఇంకా అలాగే ఓలా కేర్ ప్లస్ ప్లాన్‌లో ఇంకా ఉచిత ట్యాక్సీ రైడ్ బెనిఫిట్ ని కూడా మీరు పొందొచ్చు.ఓలా స్కూటర్ కనుక ట్రబుల్ ఇస్తే.. అప్పుడు మీకు ఈ సదుపాయం లభిస్తుంది. ఇంకా వేరే చోటకి వెళ్లినప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రేక్ డౌన్ అయితే అప్పుడు అక్కడ ఫ్రీగా మీకు హోటల్ అకామోడేషన్ లభిస్తుంది. ఇంకా అలాగే వెహికల్ కస్టడీ సర్వీస్ కూడా లభిస్తుంది.ఇక ఈ రెండు ప్లాన్లను కూడా ఓలా కస్టమర్లు ఓలా సర్వీస్ నెట్ వర్క్ లో ఎక్కడైనా వినియోగించుకోవచ్చు. దీన్ని కస్టమర్లు వారి ఇంటి దగ్గరలోని సర్వీస్ సెంటర్లో కూడా వినియోగించుకోవచ్చని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: