జుట్టు రాలే సమస్య గురించి ఎన్నోరకాలుగా ఎప్పటినుంచో వింటూనే ఉన్నాం. కానీ మనలో చాలా మంది ఎన్ని చిట్కాలు, ఎలాంటి పద్ధతులు పాటించినప్పటికీ జుట్టు రాలే సమస్య నుంచి బయటపడలేకపోతున్నారు. పైగా ఎన్నో రకాల నూనెలు, క్రీములు,షాంపూలు తీసుకొచ్చి జుట్టు రాలడాన్ని తగ్గించుకుందామని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే జుట్టు సంరక్షణలో మీరు తీసుకునే జాగ్రత్తలు తోపాటు ఇప్పుడు ఇక్కడ చెప్పబోయే  ఈ కొన్ని జాగ్రత్తలను కూడా పాటిస్తే తప్పకుండా జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు.  వీటిని వైద్య నిపుణులు కూడా సిఫార్సు చేస్తున్నారు.  అయితే అవి ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.


మనలో చాలా మంది తలంటు పోసుకునేటప్పుడు చాలా తప్పులు చేస్తుంటారు. ముఖ్యంగా తలంటు పోసుకునేటప్పుడు షాంపూను డైరెక్టుగా జుట్టుపై వేయడం వల్ల వాటిలో ఉండే హానికరమైన రసాయనాలు నేరుగా జుట్టును డ్యామేజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది.  కాబట్టి  మీరు ఎంచుకునే షాంపూలో గాఢత తక్కువగా వున్న షాంపూలై  ఉండాలి. అంతేకాకుండా మీరు వాడే రెగ్యులర్ షాంపూలో  వన్ టేబుల్ స్పూన్  ఉసిరి నీటిని కలిపి వాడడం వల్ల జుట్టు రాలడం ఆగిపోతుంది. అంతేకాకుండా జుట్టు పెరగడాన్ని  కూడా గమనించవచ్చు.

రెగ్యులర్ షాంపూలో  రెండు చుక్కల బాదం నూనెను కలిపి తల మొత్తం రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల బాదం నూనె లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా జుట్టు కుదుళ్ళకు అంది, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

షాంపూలో  గ్లిజరిన్ ను ఐదు చుక్కలు మాత్రమే కలిపి తలకు మర్దనా  చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల గ్లిజరిన్ లోని తేమ  జుట్టు కుదుళ్ళకు అంది,జుట్టు బలంగా తయారవుతుంది.ఇక అంతేకాకుండా రెండు చుక్కల రోజ్ వాటర్ ను కలిపినా కూడా జుట్టుకు తగినంత తేమ అందుతుంది.

షాంపూలో రెండు చుక్కలు నిమ్మరసం కలిపి తలంటు పోసుకుంటే  కూడా మంచి  ఫలితం ఉంటుంది.  నిమ్మరసంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాల కారణంగా తలలో ఉండే చుండ్రు,దురద తగ్గుముఖం పడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: