అయితే తాజా మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ప్రకటన సమయంలో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ విడుదల చేసిన పోస్టర్‌లో మళ్లీ "ఉలగ నాయగన్" అనే బిరుదుతో కమల్ హాసన్ పేరు ప్రెజెంట్ చేయడం గమనార్హం. దీంతో ఆయన తీసుకున్న ముందు నిర్ణయం వెనక్కి తీసుకున్నట్టేనా? అనే ప్రశ్నలు అభిమానుల్లో వినిపిస్తున్నాయి. ఇది పూర్తిగా దర్శకుడి క్రియేటివ్ నిర్ణయమా? లేక అభిమానుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని మళ్లీ ఆ ట్యాగ్‌ను అనుమతించారా? అన్నది ఆసక్తికరంగా మారింది.ఇక ఇదే తరహాలో తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఒక ఉదాహరణ మనకు కనిపించింది. పవన్ కళ్యాణ్ చాలాకాలంగా "పవర్ స్టార్" అనే బిరుదుతో ప్రసిద్ధి చెందారు. అయితే ఒక దశలో ఆయన కూడా ఆ ట్యాగ్‌ను వాడకూడదని సూచించారు. అయినప్పటికీ భీంలా నాయక్,బ్రో వంటి చిత్రాల సమయంలో ఆ బిరుదు పెద్దగా వినిపించలేదు. కానీ తర్వాత ప్రకటించిన ఈజీమరియు ఉస్తాత్ భగత్ సింగ్ చిత్రాల పోస్టర్లు, టీజర్లు వచ్చేసరికి మళ్లీ "పవర్ స్టార్" అనే ట్యాగ్ స్పష్టంగా కనిపించింది.
ఇది చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. అభిమానుల మనసుల్లో ఈ బిరుదులు కేవలం పదాలు కావు.. అవి భావోద్వేగాల ప్రతీకలు. ఒక స్టార్‌కు సంబంధించిన ట్యాగ్ అంటే ఆ హీరో కెరీర్‌కు, ఇమేజ్‌కు, అభిమానుల అనుబంధానికి ప్రతిబింబం. అందుకే కొన్నిసార్లు స్టార్లు వ్యక్తిగతంగా బిరుదులు వద్దనుకున్నా, అభిమానుల కోరికల దృష్ట్యా లేదా దర్శక నిర్మాతల అభిప్రాయం మేరకు మళ్లీ వాటిని అంగీకరించాల్సి వస్తోంది.రజినీకాంత్ – కమల్ హాసన్ కలయికలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. ఇది దక్షిణ భారత సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం అవుతుందని ఇప్పటికే ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బాక్సాఫీస్ రికార్డులు, ఓపెనింగ్స్, ప్రీ-రిలీజ్ బిజినెస్ పరంగా కూడా ఈ చిత్రం కొత్త మైలురాళ్లు సృష్టించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇద్దరు మహానటుల అనుభవం, దర్శకుడి విజన్, భారీ నిర్మాణ విలువలు అన్నీ కలిసి ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలబెడుతున్నాయి.
మొత్తానికి, స్టార్‌లకు సంబంధించిన బిరుదులు కేవలం ప్రచార పరిమితిలోనే ఉండవు. అవి వారి వ్యక్తిత్వం, ప్రయాణం, అభిమానులతో ఉన్న అనుబంధానికి సంకేతాలు. అందుకే సమయం మారినా, పరిస్థితులు మారినా, ఆ పవర్‌ఫుల్ ట్యాగ్‌లకు ఉన్న విలువ మాత్రం తగ్గదు. ఇప్పుడు ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌తో మళ్లీ ఆ బిరుదుల గొప్పతనం చర్చకు వస్తోంది. అభిమానులు కూడా అదే ఉత్సాహంతో ఈ భారీ కలయికను తెరపై చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి