అలర్జీ సమస్యలను పూర్తిగా తగ్గించడంలో మనకు తోటకూర చాలా బాగా ఉపయోగపడుతుంది.. అలర్జీ సమస్యలతో బాధపడే వారి శరీరంలో రక్షణ కణాల నుండి హిస్టమిన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి.ఇలా ఎక్కువగా ఉత్పత్తి అయిన హిస్టమిన్స్ అనేవి అలర్జీ రూపంలో బయటకు వస్తాయి. అలర్జీలు రావడానికి కారణమయ్యే హిస్టమిన్స్ ను న్యాచురల్ గా తోటకూర తగ్గిస్తుందని నిపుణులు పరిశోధనల ద్వారా తేలింది. మన రక్షణ వ్యవస్థలో ఉండే తెల్ల రక్తకణాలు అతిగా స్పందించడం వల్ల అలర్జీలు అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలర్జీకి కారణమయ్యే ఇమ్యునో గ్లోబిలిన్ ఇ ని రక్షణ వ్యవస్థ కణజాలం బాగా ఉత్పత్తి చేస్తుంది. అలర్జీకి కారణమయ్యే ఈ ఇమ్యునో గ్లోబిలిన్ ఇ ని అడ్డుకోవడంలో తోటకూర చాలా బాగా పని చేస్తుంది. తోటకూరలో గ్యాలిక్ యాసిడ్ ఇంకా వేలనిక్ యాసిడ్ అనే రెండు రకాల యాసిడ్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి అలర్జీకి కారణమయ్యే ఇమ్యునో గ్లోబిలిన్ ఇ అడ్డుకోవడంలో ఎంతగానో సహాయపడతాయి. అదే విధంగా రక్షణ వ్యవస్థ అతిగా స్పందించకుండా నియంత్రించి అలర్జీ రాకుండా చేయడంలో కూడా తోటకూర సహాయపడుతుంది.


అందుకే చర్మానికి సంబంధించిన అలర్జీ సమస్యలతో బాధపడే వారు ఈ తోటకూరను తీసుకోవడం వల్ల అలర్జీ సమస్యల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. తోటకూర మనకు కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడూ  దొరుకుతుంది. అలాగే తోటకూర దొరకని ప్రాంతం అంటూ కూడా ఉండదు. దీనిని ఎక్కువగా ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీరం లోపలి నుండి అలర్జీలు ఈజీగా తగ్గుతాయి. అలాగే బాహ్య చర్మం పై దురదలు, దద్దుర్లను, అలర్జీలను తగ్గించడంలో వేప నూనె కూడా చక్కగా పని చేస్తుంది. వేప నూనెను సమస్య ఉన్న చోట రాసి ఒక అర గంట పాటు అలాగే ఉంచాలి. తరువాత ఈ భాగంలో వేడి నీటితో ఆవిరి పట్టుకోవడం లేదా వేడి నీటితో స్నానం చేయడం వల్ల అలర్జీలు చాలా త్వరగా తగ్గుతాయి. అలాగే స్నానం చేసిన తరువాత ఆ భాగంలో కొబ్బరి నూనె రాయడం వల్ల కూడా ఈజీగా దురదలు తగ్గుతాయి.ఇలా మందులను వాడడానికి బదులుగా ఈ విధంగా సహజ సిద్దంగా కూడా చర్మ సంబంధిత అలర్జీలను తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: