చదువు మీద ప్రేమ ఉంటే ఏదైనా చేయవచ్చు. చదువుకోవాలి అనే ఆసక్తి ఉంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంత దూరం అయినా వెళ్ళవచ్చు. ఇదే నిరూపించాడు మధ్యప్రదేశ్ లో ఒక బాలుడు. ప్రతీ రోజు 24 కిలోమీటర్లు సైకిల్ తొక్కి వెళ్లి ఊహించని విధంగా మార్కులు సంపాదించాడు. కేవలం స్కూల్ కి హాజరు కావడానికి గానూ ప్రతీ రోజూ 24 కిలోమీటర్లు సైకిల్ తొక్కి అతను వెళ్ళే వాడు. 

 

అతని వయసు 15  ఏళ్ళు  కాగా అతని పేరు రోష్ని భదౌరియా, మధ్యప్రదేశ్ రాష్ట్ర బోర్డు నిర్వహించిన 10 వ తరగతి బోర్డు పరీక్షలలో 98.5 శాతం సాధించి ఎనిమిదో ర్యాంకు సాధించాడు. అతనిని సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అభినందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: