ప్రస్తుతం దేశంలో కరోనా రక్కసి ఎలా విజృంభిస్తుందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మాస్కులు ప్రతి ఒక్కరికీ అనివార్యం అయ్యాయి.  బయటకు వస్తే సోషల్ డిస్టెన్స్.. శానిటైజర్ తప్పని సరి అయ్యింది. అయితే ఇప్పుడు మాస్కులు రక రకాలుగా తయారు చేస్తున్నారు. కొంత మంది డ్రెస్స్ కు తగ్గట్టుగా మ్యాచింగ్ మాస్కులు వేసుకుంటున్నారు. ఈ మద్య ఓ గొల్డ్ మాస్కు కూడా తయారు చేయించుకున్న విషయం తెలిసిందే. తాజాగా మధురై టెంపుల్‌ సిటీలో ఓ రెస్టారెంట్‌ వారు వినూత్నంగా మాస్క్‌ ఆకృతిలో వేడి వేడి పరోటాను అందిస్తూ తమ వినియోగదారులకు కరోనా వైరస్‌పై అవగాహన పెంచుతున్నారు.

 

మధురై వాసులు మాస్క్‌ ధరించడంలో శ్రద్ధ చూపించడం లేదు.  అయితే ఇది తమ హూటల్ కి వచ్చిన వారికి కేవలం మాస్కులపై అవగాహన పెంచడం కోసం మాత్రమే అని ఇందులో అపార్థం చేసుకోవడానికి ఏమీ లేదని అన్నారు.  హోటల్‌లోని నైపుణ్యంగల వంటవారు తమ కళాత్మకతతో పరోటాను మాస్క్‌ ఆకృతితో రూపొందించి వాటిని చెవులకు ధరించే విధంగా తయారుచేశారు. ఈ మద్య కోలకతా లోని ఓ స్వీట్‌ షాపులో స్వీట్‌కు ‘కరోనా సందేశ్‌’ అని నామకరణం చేశారు. మమతా ప్రభుత్వం రోజు  నాలుగు గంటల పాటు ఆ  షాపు తెరుచుటకు అనుమతి ఇచ్చారు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: