ఏపీలో కరోనా రోజు రోజుకీ విజ్రుంభిస్తోంది. రోజూ పది వేలకి తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఏపీకి చెందిన మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా కరోనా బారిన పడ్డారు. దీంతో చికిత్స నిమిత్తం ఆయన రుయా ఆస్పత్రిలో చేరారు. ఇక భూమన కుమారుడు కూడా ఇప్పటికే కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

అయితే కరోనా బాధితుల మృతదేహాల అంత్యక్రియలపై అపోహలు తొలగించేందుకు కోవిడ్‌ సమన్వయ కమిటీ చైర్మన్‌ గా ఉన్న భూమన కొద్దిరోజుల క్రితం స్వయంగా కరోనా వైరస్ మృతదేహాలను ఖననం చేశారు. ఈ విషయం మీద ఉన్న అపోహలు తొలగించేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనాతో చనిపోయినవారి మృత దేహాలకు ఆయన దహన సంస్కారాలు చేశారు. అయితే ఇది ఎలా సోకిందనేది తెలియాల్సి ఉంది. అయితే తనకు కరోనా సోకడంతో తనతో కాంటాక్ట్ లో ఉన్న వారందరినీ టెస్ట్ చేయిన్చుకోవల్సిందిగా ఆయన కొరారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: