మధ్యప్రదేశ్ బిజేపి అభ్యర్థి, ఆ రాష్ట్ర
మంత్రి ఇమార్తీ దేవీకి ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఒకరోజు పాటు ప్రచారం నిర్వహించకుండా నిషేధం విధించింది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు చేపట్టినట్లు
ఈసీ తెలిపింది.
నవంబర్ 1న ఈ ఆదేశాలు అమలు అవుతాయని వెల్లడించింది.ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రత్యర్థితో పాటు వారి కుటుంబంలోని మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఇమార్తీ దేవీకి మంగళవారమే నోటీసులు జారీ చేసింది ఈసీ. దీనిపై వివరణ ఇచ్చిన ఇమార్తీ.. ఆరోపణలను ఖండించారు. ఈ నేపథ్యంలో
ఈసీ తాజా ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఇమార్తీ ఉల్లంఘించారని పేర్కొంది.మధ్యప్రదేశ్లో జరగనున్న 28
అసెంబ్లీ ఎన్నికల బైపోలింగ్కు ప్రచారం
నవంబర్ 1తోనే ముగియనుండటం గమనార్హం.మధ్యప్రదేశ్ మాజీ
ముఖ్యమంత్రి కమల్నాథ్ స్టార్ క్యాంపెయినర్ హోదాను
ఈసీ ఇదివరకే రద్దు చేసింది. పదేపదే నియమావళిని ఉల్లంఘించడం కారణంగా పేర్కొంది. అంతకుముందు ఇమార్తీ దేవీ లక్ష్యంగానే కమల్నాథ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం వివాదాస్పదమైంది.