బిహార్​లో సీఎం నితీశ్​ కుమార్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మొదటి విడత పోలింగ్​ను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతోందన్నారు. కరోనా సమయంలోనూ ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొని రాజకీయ పండితుల అంచనాలు తప్పని రుజువు చేశారని మోదీ అన్నారు.రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఛప్రాలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు మోదీ. కాంగ్రెస్ ​నేత రాహుల్​ గాంధీ, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్​ల పేర్లను ప్రస్తావించకుండా పరోక్ష విమర్శలు గుప్పించారు.



ఎన్డీఏది రెండు ఇంజిన్లు ఉండే శక్తిమంతమైన ప్రభుత్వం. మరోవైపు ఇద్దరు యువరాజులున్నారు. వారిలో ఒకరు ఆటవిక రాజ్యం నుంచి వచ్చిన వారు. ఎన్డీఏ అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఆ ఇద్దరు యువరాజులేమో సింహాసనాన్ని కాపాడుకునేందుకు పోరాడుతున్నారు. ఉత్తర్​ప్రదేశ్​లోనూ మూడేళ్ల క్రితం ఇద్దరు యువరాజులు నల్లజాకెట్లు ధరించి బస్సులపై కూర్చొని చేతులు ఊపుతూ గ్రామాల్లో తిరగడం మీరు చూసే ఉంటారు    అని మోదీ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: