బిహార్‌లో సీఎం నితీశ్
కుమార్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మొదటి విడత పోలింగ్‌ను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతోందన్నారు. కరోనా సమయంలోనూ ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొని రాజకీయ పండితుల అంచనాలు తప్పని రుజువు చేశారని
మోదీ అన్నారు.రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఛప్రాలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు మోదీ.
కాంగ్రెస్ నేత రాహుల్
గాంధీ, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌ల పేర్లను ప్రస్తావించకుండా పరోక్ష విమర్శలు గుప్పించారు.
ఎన్డీఏది రెండు ఇంజిన్లు ఉండే శక్తిమంతమైన ప్రభుత్వం. మరోవైపు ఇద్దరు యువరాజులున్నారు. వారిలో ఒకరు ఆటవిక రాజ్యం నుంచి వచ్చిన వారు. ఎన్డీఏ అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఆ ఇద్దరు యువరాజులేమో సింహాసనాన్ని కాపాడుకునేందుకు పోరాడుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ మూడేళ్ల క్రితం ఇద్దరు యువరాజులు నల్లజాకెట్లు ధరించి బస్సులపై కూర్చొని చేతులు ఊపుతూ గ్రామాల్లో తిరగడం మీరు చూసే ఉంటారు అని
మోదీ అన్నారు.