హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఎల్బీనగర్, నాగోల్, మన్సురాబాద్, వనస్థలిపురం, హయత్ నగర్ పరిధిలో వర్షం కురుస్తూనే ఉంది. తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట్, హబ్సిగుడ, నాచారం మల్లాపూర్ పలు ప్రాంతాల్లో అయితే కుండపోత వర్షం పడుతుంది. బాలానగర్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, చింతల్, జగద్గిరిగుట్ట, కొంపల్లి, సుచిత్ర, గాజులరామరం లో భారీనూ వర్షం పడుతుంది. 

సనత్ నగర్, బాల నగర్, బోయిన్పల్లి ప్రాంతంలోనూ వర్షం పడుతూనే ఉంది. భారీ వర్షం తో జిహెచ్ఎంసి మాన్సూన్ డిజాస్టర్ బృందాలు రంగంలోకి దిగాయి. మరో గంట పాటు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో  జిహెచ్ఎంసి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కమిషన్ ఆదేశించారు. ఇదిలా ఉండగా నగరంలో  భారీ వర్షాలతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడం వల్ల ఇళ్లలోకి నీరు వస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వర్షంతో ట్రాఫిక్ జామ్ సమస్య కూడా నెలకొంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: