టోక్యో ఒలింపిక్స్ ఆర్చరీ  విభాగంలో భారత్ చైనాను ఓడించింది. మిక్స్డ్ టీం కు చెందిన దీపికా కుమారి, ప్రవీణ్ యాదవ్ శనివారం క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు. దీపికా కుమారి మరియు ప్రవీణ్ చైనా కు చెందిన క్రీడాకారులు లిన్ ఎన్ మరియు తంగ్ చిన్ చున్ లను ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో ఓడించారు. ఇక క్వార్టర్ ఫైనల్స్ లో దీపిక ప్రవిన్ లు సౌత్ కొరియా క్రీడా కారులతో తలపడనున్నాయి. దీపిక ప్రవీణ్ లో క్వార్టర్ ఫైనల్స్ లోను విజయం సాధించేందుకు కోసం సిద్ధమవుతున్నారు.

ఇక క్వార్టర్ ఫైనల్ లో విజయం సాధిస్తే నేరుగా ఫైనల్స్ కు చేరుకుంటారు. అలా జరిగితే భారత్ ఆర్చరి పోటీల్లో ఫైనల్ లో పాల్గొంటుంది. ఇది ఇలా ఉండగా టోక్యో ఒలంపిక్స్ లో మొదటి పతకాన్ని చైనా కైవసం చేసుకుంది. చైనా మొట్టమొదటి గోల్డ్ మెడల్ దక్కించుకుంది. షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్  విభాగంలో చైనీస్ క్రీడాకారిణి యాంగ్ క్యాన్ స్వర్ణ పథకం పథకం సాధించుకుంది. కాగా క్వాలిఫై రౌండ్ లో భారత షూటర్లు నిరాశపరచడంతో ఫైనల్లో చోటు దక్కించుకోలేకపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: