తెలంగాణ ప్ర‌భుత్వంపై కోర్టుకు వెళ్లే యోచ‌న‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యార్థులున్నారు. తెలంగాణ ఈసెట్‌లో ప్ర‌వేశాల‌కు వారిని అనుమ‌తించ‌క‌పోవ‌డ‌మే దీనికి కార‌ణం. ఈసెట్‌లో ర్యాంకులు పొందిన విద్యార్థుల‌ను కౌన్సెలింగ్‌కు అనుమ‌తించ‌కూడ‌ద‌ని అధికారులు నిర్ణ‌యించారు. ఏపీలో పాలిటెక్నిక్ చివ‌రి సంవ‌త్స‌రం ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌లేద‌ని, దీనివ‌ల్ల విద్యార్థులు ధ్రువ‌ప‌త్రాలు స‌మ‌ర్పించ‌లేర‌నేది అధికారుల అభిప్రాయంగా ఉంది. నిన్న‌టి నుంచి ప్రారంభ‌మైన కౌన్సెలింగ్‌కు క‌ర్నూలు, అనంత‌పురం, క‌డ‌ప‌ జిల్లాల‌కు చెందిన విద్యార్థులు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్లో ఏర్పాటు చేసిన‌ కౌన్సెలింగ్ కేంద్రానికి హాజ‌ర‌య్యారు. అనుమ‌తి లేద‌ని అధికారులు తేల్చిచెప్ప‌డంతో రూ.1200 ఫీజు కింద చెల్లించామ‌ని, ఇప్పుడు కౌన్సెలింగ్‌కు వ‌చ్చిన త‌ర్వాత ఈమాట చెప్ప‌డం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నిస్తున్నారు. త‌మ‌కు న్యాయం జ‌ర‌గ‌డం కోసం హైకోర్టుకు వెళ‌తామ‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రులు చెబుతున్నారు. ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌క‌పోవ‌డ‌మ‌నేది కొవిడ్‌వ‌ల్ల ప్ర‌భుత్వానికి సాధ్య‌ప‌డి ఉండ‌క‌పోవ‌చ్చ‌ని, దాన్ని విద్యార్థుల‌ను బాధ్యులుగా చేయ‌డం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap