మంచిర్యాల జిల్లాలో మరోసారి భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. ఇవాళ ఉదయం మరోసారి మూడు సెకన్ల పాటు స్వల్పంగా భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.3గా నమోదైంది. నిన్న రాత్రి కూడా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా స్వల్పంగా భూమి కంపించింది. వరుస ప్రకంపనలతో జనం భయాందోళన చెందుతున్నారు. గతనెల 23న కూడా ఇక్కడ భూమి కంపించింది. తిరిగి నిన్న, ఇవాళ కూడా భూప్రకంపలు రావడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ముందెన్నడూ లేనివిధంగా భూమి ప్రకపంనలు సృష్టించడంతో కూడా ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే అధికారులు ఎలాంటి ప్రమాదం ఉండదని చెబుతున్నారు. ప్రజలు మాత్రం భయాందోళనతో బయట మైదాన ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. నిన్న కొమురంభీం జిల్లా దిండ గ్రామంలో ఒక పెంకుటిల్లు కూడా కూలిపోయింది. అది శిథిలావస్థలో ఉన్నదే అయినప్పటికీ.. భూప్రకంపనల ధాటికి కూలిందని స్థానికులు చెబుతున్నారు. అలాగే ఇతర ఇళ్లల్లో సామగ్రి కూడా భూమి కంపించిన కారణంగా కిందపడిపోవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: