హీరో విజయ్ దేవరకొండ ,రష్మిక ఎంగేజ్మెంట్ చేసుకున్న వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు అధికారికంగా అటు కుటుంబ సభ్యులు కానీ, రష్మిక, విజయ్ దేవరకొండ గాని ఈ విషయం పైన క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇలాంటి సమయంలోనే గతంలో ప్రముఖ జ్యోతిష్యులుగా పేరుపొందిన వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.




గతంలో విజయ్ దేవరకొండ ,రష్మిక గురించి మాట్లాడిన వేణు స్వామి మాటలు ఇప్పుడు మరొకసారి ట్రెండీగా మారుతున్నాయి.. గీత గోవిందం సినిమా నుంచే వాళ్లు మనకి తెలుసు.. వారిద్దరు వివాహం చేసుకుంటారు, చేసుకొని విడిపోతారని తాను ఎప్పుడో రష్మికకు కూడా ఈ విషయం చెప్పాను.. ఆయనను చేసుకోకు అని విడిపోతావని డైరెక్ట్ గానే చెప్పేసానంటూ గత ఇంటర్వ్యూలో తెలిపారు వేణు స్వామి. ఈ విషయం వల్లే కొద్దిగా తనకు, ఆమెకు మనస్పర్ధలు వచ్చాయని దీంతో తనను పక్కకు పెట్టింది అంటూ తెలిపారు వేణు స్వామి. ఆమె హీరోయిన్ అయితే నాకేంటి ఆమె నాకు మాత్రం క్లయింట్ మాత్రమే అంటూ తెలిపారు.


తనకు వ్యక్తిగతంగా ఎవరూ రిలేషన్ ఉండరు వేణు స్వామి అంటే కేవలం ఒక జ్యోతిష్యుడు, ఒక ఆస్ట్రాలజర్ అంతే తన దగ్గరికి వచ్చిన వారందరినీ కూడా క్లయింట్ రూపంలోనే వాళ్ళని చూస్తానంటూ తెలిపారు.. అలాగే లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ జాతకంలో కూడా గురువు శుక్రుడు నీచంగా ఉన్నారు కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళు కలిసి ఉండే అవకాశాలు లేవంటూ మరో ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను ఎలాంటి విషయాలైనా సరే జాతకంలో ఉండే దోషాలను బేస్ చేసుకుని మరి మాట్లాడతాను అంటూ తెలిపారు. వరుణ్ తేజ్ కు నాగదోషం, లావణ్య కు గురు దోషం ఉందని తెలిపారు. విజయ్ దేవరకొండ కెరియర్ సరిగ్గా లేదని ,అతడికి వివాహ ప్రాబ్లం కూడా ఉంటుందంటూ గతంలోనే తెలిపారు. అలాగే సమంత ,నాగచైతన్య గురించి తాను ముందే చెప్పాను అంటూ తెలిపారు వేణు స్వామి. మొత్తానికి ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక ఎంగేజ్మెంట్ రూమర్స్ తర్వాత గతంలో  వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: