సీడీఎస్ చీఫ్ బిపిన్ రావ‌త్ ప్ర‌యాణించిన ఆర్మీ హెలికాప్ట‌ర్  ఐఏఎఫ్ ఎంఐ-17 వీ5 నిన్న మ‌ధ్యాహ్నం నీల‌గిరి కొండ‌ల్లో కూలిన విష‌యం విధిత‌మే. త‌మిళ‌నాడు హెలికాప్ట‌ర్ ప్ర‌మాదానికి చెందిన ఒక‌ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో  వైర‌ల్ అవుతోంది. నీల‌గిరిలోని టూరిస్టుల‌కు ఆర్మీ హెలికాప్ట‌ర్ చిక్కిన‌ట్టు అర్థ‌మ‌వుతుంది.  ప్ర‌మాదం జ‌ర‌గ‌డానికి  కొద్ది క్ష‌ణాల ముందే ఆ వీడియో తీసిన‌ట్టు స్ప‌ష్టం అవుతోంది.

కింద న‌డుచుకుంటూ వెళ్లుతున్న‌ కొంద‌రూ త‌మ మొబైల్ ఫోన్‌ ద్వారా వీడియో తీస్తున్నారు. అయితే ఆ స‌మ‌యంలో హెలికాప్ట‌ర్ శ‌బ్ధం విన్న‌వాళ్లు.. ఆ హెలికాప్ట‌ర్‌ను త‌మ ఫోన్ల‌లో  వీడియో చిత్రీక‌రించి  బంధించారు. ద‌ట్టంగా ఉన్న పొగ‌మంచులోకి హెలికాప్ట‌ర్ వెళ్తున్న‌ట్లు ఆ వీడియోలో క‌నిపించిన‌ది. హెలికాప్ట‌ర్ పేలిన‌ట్లు ఆ వీడియోలో శ‌బ్ధం కూడ  వినిపిస్తున్న‌ది.  ఊటీలో ఉన్న టూరిస్టులు కొంద‌రూ ఆ హెలికాప్ట‌ర్‌ను వీడియో తీసారు. ఆ హెలికాప్ట‌ర్  త‌క్కువ ఎత్తులో ఎగురుతున్న‌ట్టు  వీడియోలో తెలుస్తున్న‌ది.  ఇక  వీడియో తీసిన వారు..  పేలిపోయిందా.. కూలిపోయిందా అనుకుంటూ త‌మిళ భాష‌లో కామెంట్లు కూడా  చేసుకున్నారు. వాయుసేన ఈ వీడియోను అధికారికంగా ధృవీక‌రించాల్సి ఉంది.  మ‌రోవైపు ఇవాళ ఘ‌ట‌న‌కు 30 అడుగుల‌ దూరంలో ల‌భ్య‌మైన బ్లాక్‌బాక్స్ రికార్డులో ఏమున్న‌దో.. ఈ వీడియోను ఆర్మీ ఉన్న‌తాధికారులు ప‌రిశీలించి అధికారికంగా ఏమి ప్ర‌క‌టిస్తార‌నేది చూడాలి మ‌రీ.

 


మరింత సమాచారం తెలుసుకోండి: