ఇండిగో ఎయిర్ లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్ లైన్స్ సేవలను 80 శాతం వరకు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే జనవరి 31వ తేదీ వరకు ప్రయాణికుల నుంచి ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయబోనున్నట్లు కంపెనీ వెల్లడించింది. అలాగే ప్రయాణికులు వారి అవసరాన్ని బట్టి అదే డబ్బుతో జనవరి 31వ తేదీ వరకు ఇతర విమానాల్లో టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చని ప్రకటించింది.


వాస్తవానికి ప్రయాణికుడు ఒక విమానానికి బదులు వేరే తేదీకి వేరే ఫ్లైట్ కావాలంటే కొంత రుసుము చెల్లించాలి. కానీ ఇండిగో ఎయిర్‌లైన్స్ ఈ ఫీజును జనవరి 31వ తేదీ వరకు మినహాయించింది. అయితే తాజాగా ఇండిగో ఎయిర్‌లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. కడప-విజయవాడ, చెన్నైలకు ఇండిగో విమానాలు నడపడానికి.. ఇండిగో ఎయిర్ లైన్స్ ఏపీ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీడీసీఎల్)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటివరకు ఈ రూట్‌లలో విమాన సర్వీసులు అందించిన ట్రూజెట్.. తన నిర్వహణ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో ఇండిగోకు అవకాశం దక్కింది.


ఈ మేరకు ఇండిగో ఎయిర్‌లైన్స్ తో రాష్ట్ర ప్రభుత్వం వయాబిలిటీ గ్యాఫ్ ఫండ్ (వీజీఎఫ్) కింద రూ.20 కోట్లు అందజేసినట్లు వెల్లడించింది. అయితే ఈ సేవలు మార్చి 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. త్వరలో ఇండిగో ఎయిర్ లైన్స్ చెన్నై-కడప, విజయవాడ-కడమ మధ్య వారానికి నాలుగు విమానాలు నడుపనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: