టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మోస్ట్ ఎవెయిటింగ్ చిత్రం సర్కారు వారి పాటకు చెందిన సంగీత ప్రమోషన్‌లు విపరీతమైన ఆదరణతో సూపర్ గా ప్రారంభించబడ్డాయి, కళావతి లిరికల్ వీడియో సాంగ్ అయితే అద్భుతమైన స్పందనను పొందింది.పైగా ఇప్పటికే ఉన్న అన్ని రికార్డులను ఈ బద్దలు కొట్టింది. ఇది ఇప్పటికే రికార్డు సంఖ్యలో లైక్‌లతో 24 గంటల్లో అత్యధిక వీక్షణల రికార్డును ఈ పాట బ్రేక్ చేసింది.కళావతి పాట మరో ఘనతను కూడా సాధించింది. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో 50 మిలియన్ మార్క్‌ను ఈ పాట చేరుకుంది. టాలీవుడ్‌లో అత్యంత వేగంగా 50 మిలియన్ల వ్యూస్ సాధించిన మొదటి పాట ఇది.


ఇక అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయిన ఈ పాట అన్ని మ్యూజిక్ అప్లికేషన్‌లలో మ్యూజిక్ చార్ట్‌లలో ఫస్ట్ ఉంది. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా, సిద్ శ్రీరామ్ పాట పాడగా ఇంకా అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాశారు. సంగీత ప్రియులు ఈ పాటపై తమ అభిమానాన్ని బాగా ప్రదర్శిస్తున్నారు. ఇక సర్కారు వారి పాట చిత్ర బృందం రేపు సరికొత్త అప్ డేట్ ఇవ్వనుంది. అదేంటంటే రేపు ఉదయం 11:07 లకు సర్కారు వారి పాట నుంచి అదిరిపోయే సూపర్ పోస్టర్ ని విడుదల చెయ్యనుంది చిత్ర బృందం..

మరింత సమాచారం తెలుసుకోండి: