తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగంలో ఓ మంచి పని చేస్తోంది. హెల్త్ ప్రొఫైల్ పైలెట్ ప్రాజెక్ట్ దిగ్విజయంగా అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు కింద కేవలం 70 రోజుల్లోనే ములుగు, సిరిసిల్ల జిలాలల్లో హెల్త్ ప్రొఫైల్ కోసం శాంపిల్ల సేకరణ పూర్తి చేశారు. త్వరలోనే ఆయా జిల్లాలో హెల్త్  ప్రొఫైల్ కార్డ్ లను అందించనున్నారు. ములుగు , సిరిసిల్ల జిలాల్లో హెల్త్ ప్రొఫైల్ పై ఇటీవల సమీక్షా సమావేశం నిర్వహించారు.

ములుగులో 181540 మందికి టెస్ట్ లు నిర్వహించారు.  సిరిసిల్లలో 338761 మందికి పరీక్షలు చేశారు. ఆయా శాంపిల్లను ములుగు, ఏటూరు నాగారం లో తాత్కాలిక ల్యాబ్ లు ఏర్పాటు చేసి అనాలసిస్ చేయనున్నారు. బిపి షుగర్ సహా 30 రకాల సూచిల కోసం టెస్ట్ లు చేశారు. శాంపిల్లను అనాలిసిస్ పూర్తి చేసిన తరువాత  వ్యాధులు ఉన్న వారిని గుర్తించి వారిని ఆస్పత్రులకు పంపుతారు. వారి ఫోన్ లకు సందేశం పంపుతారు. హెల్త్ ప్రొఫైల్ పూర్తి అయిన తరువాత ఆయా జిల్లాల వారికి హెల్త్ ప్రొఫైల్ కార్డ్ లు అందిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr