హైదరాబాద్‌లో జరుగుతున్న పుస్తక మహోత్సవానికి హాజరైన ఎమ్మెల్సీ కవిత.. కవులు, రచయితలపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రత్యేకించి ప్రజాకవి గోరటి వెంకన్నను ఆమె పొగడ్తలతో ముంచెత్తారు. గోరటి వెంకన్న వల్లంకి తాళం పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.. మొట్టమొదటి కేంద్ర సాహిత్య అకాడమీ సురవరం ప్రతాపరెడ్డికి వచ్చింది అప్పటి నుంచి ఆ పరంపర కొనసాగుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

అనేక మంది గొప్ప కవులు ఉన్న వారసత్వం తెలంగాణదని.. ఎందరో తెలంగాణ రచయితలు ప్రజల హృదయాలలో తరతరాలుగా గుర్తుండిపోయేలా రచనలు చేశారని  ఎమ్మెల్సీ కవిత గుర్తు చేసుకున్నారు. వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ గోరటి వెంకన్న వల్లంకి తాళం రచన చేశారని.. వర్క్ లోంచి పుట్టిన పదాలను ఇటలీ భాషలో ఉపయోగిస్తారు..తెలంగాణలో కూడా మన కష్టాలను , శ్రమను పదాలుగా వినియోగిస్తున్నామని అన్నారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ గోరటి వెంకన్న వల్లంకి తాళం రచన చేశారని.. మట్టి తత్వాన్ని అణువణువునా మీ రచనలో చెప్పారని.. చిన్న చిన్న పదాలతో అద్భుతంగా రాశారని  ఎమ్మెల్సీ కవిత అన్నారు. మీరు పుట్టిన ఈ కాలంలో పుట్టినందుకు గర్వంగా ఉంది..మీతో పాటు కౌన్సిల్ లో కూర్చోవడం సంతోషంగా ఉందని గోరటి వెంకన్నతో ఎమ్మెల్సీ కవిత చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: