ఫిబ్రవరి 11 నుంచి హైదరాబాద్లో మళ్లీ ఫార్ములా ఈ రేస్ కార్లు సందడి చేయబోతున్నాయి. ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి నిర్వాహకులు టికెట్లు కూడా విడుదల చేశారు. వెయ్యి రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు ఫార్ములా ఈ రేస్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రేట్లను పరిశీలిస్తే.. వేయి రూపాయలకు గ్రాండ్ స్టాండ్ టికెట్ దొరుకుతుంది. అదే 3,500 రూపాయలు వెచ్చిస్తే చార్జ్డ్ గ్రాండ్ స్టాండ్ టికెట్‌ లభిస్తుంది.


ఇక  6000 రూపాయలకు ప్రీమియం గ్రాండ్ స్టాండ్ టికెట్‌ లభిస్తుంది. అదే 10 వేల రూపాయలు పెడితే ఏకంగా ఏస్ గ్రాండ్ స్టాండ్ టికెట్‌ దక్కించుకోవచ్చు. దేశంలో టాప్ 25 నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఈ టికెట్ల ప్రకటన కార్యక్రమంలో ఐఏఎస్‌ అరవింద్ కుమార్ అన్నారు. ఫిబ్రవరి 11 నుంచి ఈ ఫార్ములా ఈ రేసింగ్ ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే. మొత్తం 11 అంతర్జాతీయ 22 మంది డ్రైవర్లు ఫార్ములా ఈ రేస్ పోటీల్లో పోటీ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: