అసలే గవర్నర్‌ తమిళిసైకు తెలంగాణ సర్కారు పెద్దలకు ఉప్పు నిప్పుగా ఉంది. ఈ సమయంలోకేంద్రప్రభుత్వం బడ్జెట్ లో వైద్య ఆరోగ్య శాఖకు మెరుగైన కేటాయింపులు చేసిందని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ చెబుతున్నారు. రాజ్ భవన్ లో ఆరోగ్య శాఖకు కేంద్ర బడ్జెట్ లో నిధుల కేటాయింపుపై తమిళి సై ప్రత్యేక చర్చాకార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ నందికూరి, ఎన్ ఐఎన్ డైరెక్టర్ హేమలత, ఉషాలక్ష్మీ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘురామ్, ఈఎస్ ఐ, ఎయిమ్స్ ఆస్పత్రి సహా పలు కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈసందర్భం మాట్లాడిన గవర్నర్ తమిళి సై దేశవ్యాప్తంగా నర్సింగ్ సేవలను కొనియాడారు. కేంద్రం ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వటం సంతోషించాల్సిన విషయమని తమిళి సై అన్నారు. నూతనంగా 22 ఎయిమ్స్ ఆస్పత్రుల నిర్మాణానికి బడ్జెట్ లో కేటాయించిన నిధులు ఉపయోగపడతాయని తమిళి సై అన్నారు. కానీ అసలే కేసీఆర్‌తో గొడవగా ఉంటే.. కేంద్రాన్ని ఇలా పొగిడితే ఎలాగో ఏంటో?

మరింత సమాచారం తెలుసుకోండి: