బ్యాంక్ లో మీకు అకౌంట్ ఉందా? అయితే ఈ న్యూస్ మీకోసమే. బ్యాంకులకు ఆదివారాలు, రెండో శనివారం మాత్రమే కాదు మరో రెండు రోజులు కూడా సెలవులు లభించనున్నాయి. ఇకపై ప్రతి శనివారం బ్యాంకు పని చేయదు. వారంకు కేవలం 5 రోజులు మాత్రమే బ్యాంకులు పని చేస్తాయి.

 

IHG

 

బ్యాంకు పనులు ఎం ఉన్న సరే ఈ 5 రోజులలోనే పూర్తి చేసుకోవాలి. అయితే ఇది దేశవ్యాప్తంగా వర్తించదు. కేవలం పశ్చిమ బెంగాల్‌లోనే ఈ నిర్ణయం అమలు అవుతుంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి ఉతర్వులు కూడా జారీ చేసింది. దీంతో బ్యాంకులు వారంలో ఐదు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి.

 

IHG

 

కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ ఉండడంతో కరోనా వైరస్ బారిన పడుతున్న బ్యాంకు ఉద్యోగుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈమేరకు సంచలన నిర్ణయం తీసుకుంది. బ్యాంకు బ్రాంచులు ప్రస్తుతం ప్రతి నెలా రెండు, నాలుగో శనివారాల్లో అలాగే ఆదివారాలు పనిచేయవు. 

 

IHG

 

ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వెంటనే అమలులోకి వస్తే ప్రతి శనివారం సెలవు ఉండనుంది. ఇది బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త అయినప్పటికీ బ్యాంకు కస్టమర్లకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. కాగా పశ్చిమ బెంగాల్‌లో 2,000కు పైగా బ్యాంక్ ఉద్యోగులు కరోనా వైరస్ బారిన పడ్డారు. దేశంలోనూ కరోనా వైరస్ కేసులు రోజుకు వేలల్లో వస్తున్నాయ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: