అందమైన, ఆరోగ్యకరమైన చర్మం కావాలని ఎవ‌రు కోరుకోరు..? ప‌్ర‌తి ఒక్క‌రూ ఇందుకోస‌మే తెగ ఆరాట‌ప‌డుతుంటారు. ఈ క్ర‌మంలోనే ఏవేవో ఫేస్ క్రీములు వాడ‌డంతో పాటు.. వేల‌కు వేలు ఖ‌ర్చు చేసి బ్యూటి పార్ల‌ర్స్ చూట్టు తిరుగుతుంటారు. అయితే ఇలా చేయడం వ‌ల్ల మ‌న‌కు తాత్కాలిక అందం మాత్రం సొంతం అవుతుంది. వాస్త‌వానికి మ‌న అందాన్ని రెట్టింపు చేసే ప‌దార్థాలు మ‌న ఇంట్లోనే ఉంటాయి. కానీ, వాటిని మ‌నం ప‌ట్టించుకోము. అలాంటి వాటిలో ట‌మాట కూడా ఒక‌టి. ట‌మాటాల్లోనూ ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డే ఔష‌ద గుణాలతో పాటు అందానికి ఉప‌యోగ‌ప‌డే ఔష‌ద గుణాలు కూడా ఉన్నాయి. 

 

మ‌రి అవేంటి..? అస‌ల ట‌మాటాను ఎలా ఉప‌యోగిస్తే అందాన్ని రెట్టింపు చేస్తుంది..? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. ట‌మాటాల్లో బయోటిన్, విటమిన్ సీ ప్రోటీన్ల ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తాయి. చర్మ కణాల్ని రిపేర్ చేస్తాయి. ముసలితనం రాకుండా కాపాడతాయి. ఇక చ‌ర్మాన్ని మెరిపించాలంటే ముందుగా.. రెండు చెంచాల టమాట పేస్ట్‌ తీసుకోవాలి. ఇందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి.. ఈ మిశ్రమాన్నిముఖానికి, మెగ‌కు అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తగినంత తేమ అందుతుంది. మ‌రియు ముఖంపై పేరుకున్న మ‌లినాలు కూడా తొల‌గి ప్ర‌కాశవంతంగా మారుతుంది.

 

అలాగే ట‌మాటాను తీసుకుని పేస్ట్ చేసుకోండి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.. బాగా ఆరిన త‌ర్వాత క్లీన చేసుకోవాలి. ఈ సహజ పాక్ ను ఉపయోగిస్తే.. మీ చర్మంపై ఉన్న మొటాలను, ఎండవల్ల వచ్చిన టాన్ నుండి ఉపశమనం పొందవచ్చు. అదేవిధంగా,టమాటాలను పేస్ట్ చేసుకుని.. అందులో ఒక టేబుల్‌స్పూన్ నిమ్మరసం కలిపి మిక్స్ చేయాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.. అర‌గంట త‌ర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖం మృదువుగా మార‌డంతో పాటు స్కిన్ టోన్‌ను మారుస్తుంది. ఇంకెందుకు ఆల‌స్యం ఈ సింపుల్ టిప్స్ మీరు యూజ్ చేసి మెరిసిపోండి.

 
  

మరింత సమాచారం తెలుసుకోండి: