ఈ ఒక్కటి తింటే జుట్టు సమస్యలు అన్నీ మాయం..వాల్ నట్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా జుట్టుకి ఎంతో మేలు చేస్తుంది. దీన్నే బ్రెయిన్ ఫుడ్ అని కూడా అంటారు.అదే సమయంలో దీనిని తీసుకోవడం ద్వారా, మీ జ్ఞాపకశక్తి కూడా చురుకుగా మారుతుంది. అయితే వాల్‌నట్స్ జుట్టుకు కూడా చాలా హెల్తీ అని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. జుట్టు పెరుగుదలకు వాల్‌నట్ చాలా మంచిదని, ఇది మీ స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచుతుందని చెబుతున్నారు. వాల్‌నట్‌లను తింటే జట్టు సమస్యలన్నీ దూరమవుతాయని.. జుట్టు రాలడం, చుండ్రు తదిదర సమస్యలకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అటువంటి పరిస్థితిలో మీరు వీటిని ఎలా ఉపయోగిస్తే మేలు కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..చుండ్రుకు చెక్ పెట్టి.. జుట్టుకు మంచి పోషణను అందించడానికి పెరుగులో వాల్‌నట్ లను ఉపయోగించండి. పెరుగు వాల్నట్ పొడిని బాగా కలపండి. ఆ తర్వాత మీ తలకు అప్లై చేసి కాసేపు అలాగే ఉంచాలి. అనంతరం జుట్టును షాంపూతో శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల జుట్టుకు మంచి పోషకాలు అంది సమస్యలు దూరమవుతాయి.


జుట్టుపై వాల్‌నట్‌లను ఉపయోగించడానికి రెండింటిని లేదా సరిపడే విధంగా తీసుకోండి. దీన్ని ఒకటిన్నర కప్పు వెజిటబుల్ ఆయిల్‌లో వేసి కాసేపు మరిగించాలి. ఆ తర్వాత దానిని ఫిల్టర్ చేసి మీ జుట్టుకు పట్టించాలి. ఇది మీ జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది.రోజూ రెండు వాల్‌నట్‌లను తినండి.వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దీని వినియోగం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, జుట్టు పెరుగుదలను కూడా మెరుగుపరుస్తుంది. అందువల్ల, మీరు ప్రతిరోజూ 2 వాల్‌నట్‌లను తీసుకోవాలి.జుట్టులో వాల్‌నట్‌లను ఉపయోగించడం వల్ల పెరుగుదల మెరుగుపడుతుంది.వాల్నట్ జుట్టు నుంచి చుండ్రు, దురద సమస్యను తొలగిస్తుంది.వాల్ నట్స్ వాడటం వల్ల జుట్టు నల్లబడుతుంది.వాల్‌నట్ జుట్టులో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: