తెలుగు సినీ పరిశ్రమలో తెలుగమ్మాయిగా హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది హీరోయిన్ అనన్య నాగళ్ల. మల్లేశం అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వకీల్ సాబ్ సినిమాలో నటించి బాగానే పేరు సంపాదించింది. ప్రస్తుతం వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. అయితే ఇటీవలే ఈమె సబ్స్క్రిప్షన్ ఫీచర్ ని కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే..


ఈ విషయం పైన కొంతమంది నెటిజెన్స్ తప్పుగా అర్థం చేసుకొని ఈమె పైన విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విషయం పైన ఘాటుగానే స్పందించింది. ఇదివరకు ఇదే వివాదం పైన విష్ణు ప్రియ పైన కూడా కేసు నమోదయ్యింది. అనన్య కూడా డబ్బులు చెల్లించి తన కంటెంట్ లో ఆమె అడల్ట్ లేదా బూతు కంటెంట్ పోస్ట్ చేస్తుందంటు చాలామంది కామెంట్స్ చేస్తూ విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను అనన్య తీవ్రంగా ఖండించింది.



తాను సబ్స్క్రిప్షన్ ప్లాన్లో పోస్ట్ చేస్తున్నది కేవలం భక్తికి సంబంధించిన కంటెంట్ అంటూ ఆమె క్లారిటీ ఇచ్చింది. తన పర్సనల్ లైఫ్ విశేషాలతో పాటు తనకు ఇష్టమైన ఆధ్యాత్మిక విషయాలను దేవాలయాలను తన సందర్శించినప్పుడు తీసే వీడియోలను అక్కడ పంచుకున్నటువంటి కొన్ని అనుభవాలను తాను పోస్ట్ చేస్తానని అందులో ఎలాంటి అశ్లీలత ఉండదని కేవలం భక్తి కంటెంట్ మాత్రమే ఉంటుందంటూ తెలియజేసింది. ఇక డబ్బులు తీసుకొని ఇలాంటి కంటెంట్ పెట్టడం ఏంటి అంటూ ప్రశ్నించే వారికి.. తన సమాధానం ఇదే అంటూ ఇది ఫ్లాట్ ఫామ్ కల్పించిన సౌకర్యమని, తన ప్రైవేట్ స్పేస్ ను గౌరవించే అభిమానుల కోసం మాత్రమే ఇదని తప్పుడు ప్రచారాలు చేసే ముందు నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాలి అంటూ సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: