చంద్రబాబు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు పాటు ఆనందంగా ఉండాలని ఎన్టీఆర్ ఆకాంక్షిస్తున్నానని ప్రజలకు సేవ చేయడంలో ఆయన చూపే అంకితభావం పట్టుదల ఇలాగే కొనసాగాలని, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలు ఆయనకు ఆ దేవుడు అందించాలని కోరుకుంటున్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ తన సోషల్ మీడియా వేదికగా ఈ పోస్ట్ చేయడం వైరల్ గా మారింది. సీఎం చంద్రబాబు న్యాయకత్వంలో రాష్ట్ర ప్రజల గౌరవాన్ని అభివృద్ధి చేయగలరంటూ ఎన్టీఆర్ పరోక్షంగా తెలియజేశారు అంటూ టిడిపి కార్యకర్తలు తెలియజేస్తున్నారు.
గత కొంతకాలంగా ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య రాజకీయ సంబంధాల గురించి పలు రకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ స్వయంగా శుభాకాంక్షలు చెప్పడంతో ఇప్పుడు ఆ రూమర్స్ కు తెరపడిందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ గతంలో ఎన్నడు చూడని విధంగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం సుమారుగా 20 కేజీల వరకు ఎన్టీఆర్ బరువు తగ్గినట్లుగా సమాచారం. ఎన్టీఆర్ కి జోడిగా రుక్మిణి వసంత్ నటిస్తోంది. అలాగే దేవర 2 సినిమాలో కూడా త్వరలోనే నటించే అవకాశాలు ఉన్నట్లు వినిపిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి