మార్చి 22వ తేదీన ఒకసారి చరిత్రలకు వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జన్మించారు. మరి ఒక్కసారి హిస్టరీ లోకి వెళ్లి నేడు  జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి.. 

 

 అమరావతి శేషయ్య శాస్త్రి జననం  : మచిలీపట్నం జిల్లా తాహసిల్దార్ గా డిప్యూటీ కలెక్టర్ గాని పుదుక్కొట్టై సంస్థానంలో దివానుగా పనిచేసిన అమరావతి శేషయ్య శాస్త్రి 1928 మార్చి 22వ తేదీన జన్మించారు.పుదుక్కొట్టై సంస్థానంలో దివానుగా పనిచేసిన సమయంలో ఆయన చేసిన గొప్ప సంస్కరణలు చెప్పుకోదగ్గవి. తమిళులు అయినప్పటికీ తెలుగు అనర్గళంగా మాట్లాడడం ఏకంగా  రాతకోతలు కూడా నేర్చుకున్నారు అమరావతి శేషయ్య శాస్త్రి. 

 

 యజ్ఞ నారాయణ శాస్త్రి జననం : ప్రముఖ తెలుగు రచయిత కవి శతావధానాలు అయినా యజ్ఞ నారాయణ శాస్త్రి 1900 సంవత్సరంలో మార్చి 22వ తేదిన జన్మించారు. ఈయన రాసిన రచనలు అందించిన కవితలు ఎంతగానో ప్రజలు ఆదరించారు. 

 

 కట్సుకో సరహసి జననం  : జపాన్ దేశానికి చెందిన భూ రసాయన శాస్త్రవేత్త కట్సుకో సరిహసి . సముద్రంలోని కార్బన్డయాక్సైడ్ పరిమితుల్ని అదేవిధంగా వాతావరణంలో కలిగే దుష్ఫలితాల గురించి కూడా పరిశోధనలు చేశారు. ఈమె  1920 మార్చి 22వ తేదీన జన్మించారు. సముద్రంలోని కార్బన్డయాక్సైడ్ పరిమితులు కనుగొనేందుకు... అంతేకాకుండా వాతావరణంలో ఉండే దుష్ఫలితాలను గురించి తెలుసుకునేందుకు ఎంతగానో కృషి  చేశారు. ఇక 2007 సెప్టెంబర్ 29వ తేదీన న్యుమోనియా వ్యాధితో బాధపడుతూ మరణించారు. 

 

 

 టేకు మల్లు రామేశ్వరరావు జననం  : ప్రముఖ కవి విమర్శకుడు జానపద వాజ్మయంలో సుప్రసిద్ధులైన టేకుమళ్ళ కామేశ్వరరావు 1907 ఫిబ్రవరి 22వ తేదీన జన్మించారు. ఈయన బాల వాజ్మయంలో  ఎంతగానో కృషి చేశారు. పాత పాటలు జోల పాటలు సేకరించి ప్రచురించేవారు టేకుమళ్ళ కామేశ్వరరావు. వ్యవహారిక భాషకు కూడా కొన్ని నియమాలు అవసరం అనే అభిప్రాయం ఉన్న వ్యవహారిక భాషావాది  టేకుమళ్ళ కామేశ్వరరావు. ఉపాధ్యాయునిగా ఉద్యోగం ప్రారంభించి స్కూల్ ఇన్స్పెక్టర్ గా కూడా పనిచేశారు ఈయన. టేకుమళ్ళ కామేశ్వర రావు రాసిన ఎన్నో రచనలు ప్రేక్షకాదరణ పొందాయి. ఇక ఈయన  రాసిన ఎన్నో రచనలకు గాను అవార్డులు సైతం అందుకున్నారు టేకుమళ్ళ రామేశ్వరరావు.

మరింత సమాచారం తెలుసుకోండి: